Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాళాలతో జకోవిచ్ బాధను తగ్గించిన ప్రియురాలు!

లండన్: వింబుల్డన్ ఫైనల్లో ఓటమి బాధ నుండి బయటపడేందుకు జకోవిచ్‌కు ప్రియురాలు ఎంతగానో సాయపడిందట. ఇటీవల జరిగిన వింబుల్డన్‌లో నొవాక్ జకోవిచ్ పైన బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే విజయం సాధించిన విషయం తెలిసిందే. జకోవిచ్‌ను ఫైనల్లో ఓడించి 77 ఏళ్ల తర్వాత వింబుల్డన్ ట్రోఫీని అందుకున్న బ్రిటన్ ఆటగాడిగా నిలవడమే కాకుండా, బ్రిటన్ చిరకాల వాంఛను నెరవేర్చాడు.

ఫైనల్లో ఓడిన జకోవిచ్ విషాదంలో మునిగిపోయాడట. అయితే ఆయన ప్రియురాలు జెలీనా రిస్టిక్ అతనిని మామూలి తీసుకు వచ్చేందట. ప్రియుడ్ని మామూలు స్థితికి తీసుకు వచ్చేందుకు రిస్టిక్ కొత్త పంథాను ఎన్నుకుందట. అది దాతృత్వం పంథా. నొవాక్ జకోవిచ్ ఫౌండేషన్ కోసం విరాళాల సేకరణ చేపట్టిందట.

Novak Djokovic

జొకోవిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లండన్‌లో డిన్నర్ ఏర్పాటు చేసిన 27 ఏళ్ల రిస్టిచ్ దానికి జొకోవిచ్‌తో పాటు ఇతర సెలెబ్రిటీలనూ ఆహ్వానించింది. నయోమి క్యాంప్‌బెల్, గోల్డీ హాన్, రోనీ వుడ్ వంటి స్టార్లతోపాటు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేద బాలలకు అండగా నిలుస్తున్న ఈ ఫౌండేషన్‌కు విరాళాలు అందించాలని కోరడం ఆలస్యం అప్పటికప్పుడు రూ.9.82 కోట్లు పోగయ్యాయట.

దీంతో ఆనందపడ్డ జొకోవిచ్.. ఫౌండేషన్‌కు ఇంత పెద్ద మొత్తం విరాళంగా రావడం సంతోషాన్నిచ్చిందని అన్నాడు. తనను ఓటమి బాధ నుండి బయటకు తీసుకు రావడమే కాకుండా, తన ఫౌండేషన్‌కు భారీగా విరాళాలు సేకరించి పెట్టిన ఘనత తన ప్రియురాలిదేనని జకోవిచ్ ఆనందపడుతున్నాడట. ఆమె గతంలో స్విమ్ సూట్ ధరించడంతో పాటు మోడలింగ్ కూడా చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+