
నాలుగు సెట్లపాటు సాగిన సెమీస్ సమరంలో ప్రపంచ నెంబర్‌వన్ జొకోవిచ్‌ను మట్టి కరిపించి వింబుల్డన్‌లో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు తొలిగ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం తపిస్తున్న ఆండీ ముర్రే సెమీస్‌లో సోంగాను చిత్తుచేసి ఫెడరర్‌తో టైటిల్ ఫైట్‌కు సిద్ధమయ్యాడు. 74 ఏళ్ల తర్వాత వింబుల్డన్ ఫైనల్ చేరిన తొలి బ్రిటన్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
శుక్రవారమిక్కడి ఆల్ ఇం గ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్‌లో జరిగిన సెమీఫైనల్లో మూడోసీడ్, స్విస్ దిగ్గజం ఫెడరర్ 6-3, 3-6, 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఫెడరర్ విజేతగా నిలిస్తే ఏడు విం బుల్డన్ టైటిళ్ల తో పీట్ సంప్రాస్ రికార్డును సమం చేస్తాడు. మరో సెమీస్‌లో లోకల్ బాయ్ ముర్రే 6-3, 6-4, 3-6, 7-5 తో జో విల్‌ఫ్రెడ్ సోంగాపై విజయం సాధించి కెరీర్‌లో తొలిసారి గా వింబుల్డన్ ఫైనల్‌కు చేరాడు. కాగా, గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో ముర్రే ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి.
ప్రత్యర్థికి అంత తేలిగ్గా లొం గని జొకోవిచ్ ఫెడెక్స్ క్లాస్‌కు తలొగ్గక తప్పలేదు. తొలిసెట్ ఆరోగేమ్‌లో నొవాక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ అదే జోరులో ఆ సెట్‌ను కైవసం చేసుకుని హెచ్చరికలు జారీచేశాడు. అయితే రెం డోసెట్‌లో పుంజుకున్న జొకోవిచ్ రెండోగేమ్‌లోనే ఫెడెక్స్ సర్వీ స్‌ను బ్రేక్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లి మరో పొరపాటు చేయకుండా ఆ సెట్‌ను నెగ్గాడు.
హోరాహోరీగా సాగిన మూడో సెట్ ఆరో గేమ్‌లో ఫెడరర్, తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ బ్రేక్ అవకాశాలను చేజార్చుకున్నారు. అయితే పదోగేమ్‌లో వ చ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఫెడరర్ బ్రేక్ సాధించి ఆ సెట్‌నూ నెగ్గి 2-1 ఆధిక్యంలో నిలిచాడు. అదే జోరులో నాలుగో సెట్ రెండోగేమ్‌లోనే బ్రే క్ సాధించాడు. 5-3 ఆధిక్యంలో ఉన్న దశలో సర్వీస్ చేసిన ఫెడెక్స్ మ్యాచ్‌ను ముగించేశాడు.