Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్: సంప్రాస్, రెన్‌షా రికార్డు సమం చేసిన ఫెదరర్

లండన్, జులై 9: వయసు ముప్పై దాటినా తనలో ఇంకా చేవ తగ్గలేదని స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ నిరూపించాడు. వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఫెదరర్ రికార్డుస్థాయిలో ఏడోసారి గెల్చుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఫెదరర్‌ 4-6, 7-5, 6-3, 6-4తో బ్రిటిష్‌ ఆండీ ముర్రేను ఓడించాడు. ఇది ఫెదరర్‌కు రికార్డును సమం చేస్తున్న ఏడవ వింబుల్డన్‌ టైటిల్‌, 17వ గ్రాండ్‌ శ్లామ్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన ఫెదరర్‌కు 11 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 86 లక్షలు)... రన్నరప్ ముర్రేకు 5 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 4 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Roger Federer

కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన ఈ స్విస్ స్టార్ తాజా విజయంతో సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. చివరిసారి ఫెదరర్ 2010 జూన్ 6వ తేదీన నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. ఇది ఇలా ఉంటే ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ పురుషుల చాంపియన్‌ కోసం బ్రిటన్‌ 76 ఏళ్లుగా సాగిస్తున్న నిరీక్షణను అంతం చేయాలని తాను కన్న కల ఇలా భగ్నమైనందుకు ముర్రే కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ముర్రే ఆడిన నాలుగు గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్స్‌ను ఓడిపోయాడు.

1938 తర్వాత తొలిసారి బ్రిటన్ ఆటగాడు వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకోవడంతో ముర్రే మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రధాని కామెరూన్, యువరాణి కేథరిన్, సాకర్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ తదితర ప్రముఖులు రాయల్ బాక్స్‌కు వచ్చారు. బ్రిటన్ యావత్ ప్రజానీకం ఈ మ్యాచ్‌ను ఆసక్తితో పరిశీలించింది. స్వదేశీ అభిమానుల సమక్షంలో ముర్రే విజృంభించి తొలి సెట్‌ను సొంతం చేసుకొని ఆశలు రేకెత్తించాడు. రెండో సెట్ 12వ గేమ్‌లో ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెదరర్ రెండో సెట్‌ను 7-5తో దక్కించుకున్నాడు. మూడో సెట్‌లో స్కోరు 1-1 వద్ద ఉన్నపుడు వర్షం రావడంతో 40 నిమిషాల విరామం తర్వాత ఫైనల్ కొనసాగింది.

మూడో సెట్‌లో ముర్రే సర్వీస్ చేసిన ఆరో గేమ్ ఏకంగా 20 నిమిషాలు జరిగింది. 10 'డ్యూస్'ల తర్వాత ముర్రే సర్వీస్‌ను ఫెదరర్ బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఒకరకంగా ఈ గేమ్ మ్యాచ్‌కే కీలక మలుపుగా మారింది.1936లో టైటిల్‌ విజేత ఫ్రెడ్‌ పెర్రీ తరువాత వింబుల్డన్‌ గెలిచిన తొలి బ్రిటిష్‌ క్రీడాకారుడు కావాలని ముర్రే తపించాడు. కాగా, తన ఎనిమిదవ వింబుల్డన్‌ ఫైనల్‌, 24వ గ్రాండ్‌ శ్లామ్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ ఆడిన ఫెదరర్‌ ఏడు సార్లు చాంపియన్‌గా పీట్‌ సంప్రాస్‌, విలియమ్‌ రెన్‌షా సరసన చేరాడు.

135 ఏళ్ల వింబుల్డన్ చరిత్రలో ఏడుసార్లు విజేతగా నిలిచిన మూడో క్రీడాకారుడిగా ఫెదరర్‌కు గుర్తింపు లభించింది. గతంలో విలియమ్ రెన్‌షా (బ్రిటన్), పీట్ సంప్రాస్ (అమెరికా) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఒకే గ్రాండ్‌స్లామ్‌ను అత్యధికంగా ఏడుసార్లు చొప్పున నెగ్గిన ఏడో క్రీడాకారిడిగా ఫెదరర్ గుర్తింపు పొందాడు. పీట్ సంప్రాస్ పేరిట ఉన్న ఆల్ టైమ్ అత్యధిక వారాల టాప్ ర్యాంక్ (286 వారాలు) రికార్డును ఫెదరర్ సమం చేశాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+