వింబుల్డన్: పురుషుల క్వార్టర్ ఫైనల్స్ ఇలా (పిక్చర్స్)
లండన్: వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీల్లో సెర్బియాకు చెందిన టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. నాలుగో సీడ్, స్పెయిన్ ఆటగాడు డేవిడ్ ఫెర్రర్‌కు నిరాశ ఎదురైంది. 8వ సీడ్ అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్ పోట్రో చేతిలో పరాజయం పాలై పోరు ముగించాడు. రెండో సీడ్ ఆండీ ముర్రే క్వార్టర్స్‌లో శ్రమించి నెగ్గాడు. వెర్డ్డాస్కోతో ఐదు సెట్లపాటు పోరు సాగించి సెమీస్‌లో అడుగుపెట్టాడు.
జొకోవిచ్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా సాగుతున్నాడు. స్టార్ ఆటగాళ్లంతా ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతనే ఏకైక ఫేవరెట్‌గా మారాడు. చెక్ రిపబ్లిక్ ఆటగాడు థామస్ బెర్డిచ్‌తో జరిగిన ఈ క్వార్టర్స్ మ్యాచ్‌లో మూడు వరుస సెట్లను చేజిక్కించుకుని గెలుపొందాడు. తొలి సెట్ మినహా అన్ని సెట్లూ శ్రమించకుండానే కైవసం చేసుకున్నాడు. తొలి సెట్ హోరాహోరీగా సాగడంతో టైబ్రేకర్‌కు దారి తీసింది. టైబ్రేకర్‌లో నెగ్గిన జొకోవిచ్ ఆ తర్వాత వెనక్కి తి రిగి చూడలేదు. 7-6 (5), 6-4, 6-3, తో మిగతా రెండు సెట్లనూ గెలుచుకుని సెమీస్ లో డెల్‌పోట్రోతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడు.

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ పైనల్లో స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వెర్డాస్కోపై విన్నింగ్ పాయింట్ సాధించిన బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే ప్రతిస్పందన ఇలా..

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన థామస్ బెర్డిచ్‌తో తలపడుతూ సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ ఇలా..

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో థామస్ బెర్డిచ్‌ను ఓడించిన తర్వాత జకోవిచ్ (ఎడమ పక్కన) ఇలా..

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌కు చెందిన డేవిడ్ ఫెర్రర్‌పై తలపడుతూ గాయపడిన అర్జెంటీనాకు చెందిన జాన్ మార్టిన్ డెల్ పోత్రో చికిత్స పొందుతూ..

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ పురుషుల సింగిల్స్‌లో డేవిడ్ ఫెర్రర్‌ను ఓడించిన ఆనందంలో జాన్ మార్టిన్ డెల్ పోట్రో ఇలా..
వెర్డాస్కోతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ముర్రే విజయం సాధించాడు. 4-6, 3-6, 6-1, 6-4, 7-5తో ఐ దు సెట్లపాటు చెమటోడ్చి నెగ్గి సెమీస్‌లో జనోవిచ్‌తో పోరుకు సన్నద్ధమయ్యాడు. ఇదే విభాగంలో ఫెర్రర్‌ను దురదృష్టం వెంటాడింది. డెల్ పోట్రోతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 2-6, 4-6, 6-7(5)తో వరుస సెట్లలో చిత్తయ్యాడు. మరో మ్యాచ్‌లో పోలెండ్ ఆటగా డు జెర్జీ జనోవిచ్ 7-5, 6-4, 6-4తో తన దేశానికే చెందిన కుబోట్‌ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించాడు.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు పేస్, సానియా జోడీలు ప్రీక్వార్టర్స్‌కు ప్రవేశించగా, పురుషుల డబుల్స్‌లో మహేశ్ భూపతి జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ఆటగాళ్లు రోహన్ బోపన్న, సానియా మీర్జా జోడీలు క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాయి. బుధవారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి ముందంజ వేశాయి.
చైనా క్రీడాకారిణి జీ జెంగ్‌తో జోడీ కట్టిన బోపన్న 7-6 (4), 3-6, 6-1తో జోహన్ బ్రున్‌స్ట్రామ్ (స్వీడన్)-కటాలిన్ మరోసీ (హంగేరి) ద్వయంపై చెమటోడ్చి నెగ్గాడు. టై బ్రేకర్‌కు దారి తీసిన తొలి సెట్‌లో పోరాడి నెగ్గిన బోపన్న జోడీ.. రెండో సెట్‌ను చేజార్చుకుంది. ఆనక తేరుకుని నిర్ణాయక మూడో సెట్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకుని ముందంజ వేసింది.
మరో మ్యాచ్‌లో రొమేనియా క్రీడాకారిణి హోరియా టికాతో జోడీ కట్టిన సానియా.. 6-1, 7-5తో ఎరిక్ బ్యుటోరక్ (అమెరికా)-అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్) ద్వయంపై వరుస సెట్లలో గెలుపొంది టైటిల్ రేసులో మరో అడుగు ముందుకు వేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications