చంపేస్తామని రోజర్ ఫెదరర్‌కు చైనాలో బెదిరింపు

తాము ఫెదరర్‌ను చంపాలనుకుంటున్నట్లు చైనాలో విశేష ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్ బైదూ డాట్ కామ్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఆ బెదిరింపును పోస్టు చేశాడు. బ్లూ క్యాట్ పాలీథీస్టిక్ రిలీజియన్ ఫౌండర్ 07 పేరు మీద రోజర్ ఫెదరర్‌ను బెదిరించినట్లు ఓ ఏజెన్సీ తెలిపింది.
దాంతో పాటు రోజర్ ఫెదరర్ చిత్రం రూపురేఖలు మార్చి ఆగంతకుడు పోస్టు చేశాడు. పోలీసు, స్టేట్ ఏజెన్సీస్ ఫెదరర్‌కు భద్రత పెంచాలని ఆదేశించాయి. ఆ బెదిరింపు ఆకతాయి పని అయి వుంటుందని, అది ఫెదరర్ అబిమానులపై ఏ విధమైన ప్రభావం చూపదని నిర్వాహకులు అంటున్నారు. అయితే, కొట్టిపారేయడంతో సరిపెట్టకుండా ఆయనకు భద్రత పెంచారు.
ఫెదరర్ షాంఘైకి వచ్చే సమయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను విఐపి టన్నెల్ ద్వారా హోటల్‌కు చేరవేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. టెన్నిస్ క్రీడాకారులపై దాడులు కొత్తేమీ కాదు. 1993ల మాజీ టెన్నిస్ ప్లేయర్ మోనికా సెలెస్‌పై ఓ అభిమాని హాంబర్గ్‌లో దాడి చేశాడు. రోజర్ ఫెదరర్‌పై 2009లో 2009 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో దాడి జరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications