ఫెదరర్: ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి క్వార్టర్స్‌లో ఓటమి

పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెడరర్ ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి పాలయ్యాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో 6-7 (1/7), 4-6, 6-3, 3-6తో రోజర్ ఫెదరర్‌ను ఓడించి థామస్ బెర్డిచ్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ 7 ఏస్‌లు కొట్టగా.. థామస్ బెర్డిచ్ 14 ఏస్‌లు కొట్టాడు. తొలి సెట్ తొలి గేమ్‌లోనే బెర్డిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తడబడ్డాడు. బెర్డిచ్ పుంజుకొని స్కోరును 3-3వద్ద సమం చేశాడు.
అదే క్రమంలో టైబ్రేక్ వరకు వెళ్లిన ఈ సెట్‌లో బెర్డిచ్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచి ఫెడరర్‌కు కేవలం ఒక పాయింట్ మాత్రమే ఇచ్చి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లోనూ బెర్డిచ్ జోరు కొనసాగింది. మూడో సెట్‌లో తన స్తతా చాటి ఫెదరర్ నెగ్గాడు. అయితే నాలుగో సెట్‌లో బెర్డిచ్ ఆటతీరు గాడిలో పడటంతో ఫెడరర్‌కు ఓటమి తప్పలేదు. రికార్డుస్థాయిలో 17 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ 2003 తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకోకపోవడం ఇదే తొలిసారి.
2004 నుంచి 2008 వరకు యూఎస్ ఓపెన్‌ను వరుసగా ఐదుసార్లు నెగ్గిన ఫెడరర్ 2009లో రన్నరప్‌గా నిలిచాడు. 2010, 2011లలో మాత్రం సెమీఫైనల్లోనే నిష్ర్కమించాడు. యూఎస్ ఓపెన్‌లో రాత్రి వేళల్లో జరిగిన మ్యాచ్‌ల్లో ఏనాడూ ఓడిపోని ఫెడరర్ నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయాడు. 2010 వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో కూడా ఫెదరర్‌ను బెర్డిచ్ ఓడించాడు.
తెలుగు వన్ఇండియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications