ముర్రే: లవర్‌కు ముద్దు, ప్రధానికి వీడిన శాపం(పిక్చర్స్)
లండన్: బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే చరిత్ర సృష్టించాడు. 77 ఏళ్ల తర్వాత వింబుల్డన్ ట్రోఫీని అందుకున్న బ్రిటన్ ఆటగాడిగా నిలిచాడు. బ్రిటన్ చిరకాల వాంఛను నెరవేర్చాడు. టాప్‌సీడ్ల మధ్య హోరాహోరీగా జరుగుతుందనుకున్న ఫైనల్ సమరం ఏకపక్షంగా ముగిసింది. ప్రపంచ నెంబర్‌వన్ జొకోవిచ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయాడు. వరుస సెట్లలో గెలిచిన ముర్రే వింబుల్డన్ ట్రోఫీని తొలిసారి ముద్దాడాడు.
1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత వింబుల్డన్ గెలిచిన ఇంగ్లీష్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఇక్కడి ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో 3 గంటల 9 నిమిషాలు సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ ముర్రే 6-4, 7-5, 6-4తో సెర్బియా స్టార్, ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను వరుస సెట్లలో ఓడించి కెరీర్‌లో రెండో గ్రాండ్ స్లామ్ గెలిచాడు. గతేడాది యూస్ ఓపెన్లో చాంపియన్‌గా నిలిచిన ముర్రే.. వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్ చేతిలో ఓటమి చవిచూసి రన్నర ప్‌తో సరిపెట్టుకున్నాడు.

ఆండీ ముర్రే గెలిచిన అనంతరం ట్రోఫీని ముద్దాడాడు. గెలిచాక మాట్లాడుతూ... బ్రిటీష్ ఆటగాడు గెలవాలని అందరూ ఎంతలా కోరుకున్నారో తనకు తెలుసునని, అంతా సంతోషించారని అనుకుంటున్నానని, ఇది తాను సాధిస్తాననుకోలేదని, చివరి గేమ్ చాలా కఠినంగా సాగిందని, బహుశా తన జీవితంలో ఇదే కష్టమైన పాయింటని, తన కోసం కోచ్ ఇవాన్ లెండల్ చాలా కష్టపడ్డాడని ముర్రే చెప్పాడు.

మ్యాచ్ సందర్భంగా ఆండీ ముర్రే ప్రియురాలి హావభావాలు

నొవాక్ జకోవిచ్ పైన గెలిచిన అనంతరం ఆండీ ముర్రే తన ప్రియురాలి వద్దకు వచ్చి ముద్దు ఇచ్చాడు

జకోవిచ్ పైన గెలిచిన ఆనందంలో అలాగే కోర్టులో కూలిన ముర్రే

వింబుల్డన్ నెగ్గిన ఆండీ ముర్రే గెలిచిన అనంతరం కోర్టును ముద్దాడుతున్న దృశ్యం

వింబుల్డన్ ట్రోఫీతో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే. పక్కనే రన్నరప్ నొవాక్ జకోవిచ్.

బ్రిటన్ ప్రధానమంత్రి కామెరూన్ వైట్‌పై ఇప్పటి వరకు ఓ అపప్రద ఉండేది. ఆయన ఎవరైనా క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పినా, మ్యాచుకు హాజరైనా ఓడిపోతారనే భయం ఉండేది. అయితే సెమీ ఫైనల్‌కు ముందు ముర్రేకు కామెరూన్ శుభాకాంక్షలు తెలిపాడు. ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ రెండు మ్యాచులలో ముర్రే సత్తా చూపి వింబుల్డన్ నెగ్గాడు. దీంతో కామెరూన్ అపశకునమనే శాపం తొలగినట్లయింది.

వింబుల్డన్ పురుషుల ఫైనల్స్‌లో టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించింది 'స్మైల్ పింకీ'గా పేరొందిన భారత బాలిక పింకీ సోన్కార్. తెల్లటి దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ మైదానంలోకి వచ్చిన పింకీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అనంతరం వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఈ అరుదైన అవకాశాన్ని పొందిన 11 ఏళ్ల పింకీ గతంలో గ్రహణం మొర్రితో బాధపడేది. న్యూయార్క్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ 'స్మైల్ ట్రైన్' 2007లో పింకీకి ఉచితం శస్త్రచికిత్స చేసి ఆమెకు సరికొత్త జీవితాన్నిచ్చింది.
ఈ సీజన్లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకోవిచ్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకున్నాడు. సెమీస్‌లో డెల్‌పొట్రోతో హోరాహోరీగా పోరాడిన జొకోవిచ్.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు. 40 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక బ్రిటన్ ఫుట్‌బాల్ స్టార్లు బెకహామ్, రూనీలతో పాటు స్టేడియంలోని 15 వేల మంది ప్రేక్షకుల ప్రోత్సాహంతో సెంటర్ కోర్టులో ఆండీ మరో స్టార్‌లా వెలిగిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications