లండన్ ఒలింపిక్స్: సానియా, పేస్ జోడీ సర్దుకుందా?

టెన్నిస్ క్రీడాకారుల మధ్య వివాదం తలెత్తిన తర్వాత వారిద్దరు కలిసి కనిపించడమే ఆసక్తికి ఓ కారణంగా కనిపిస్తోంది. బుధవారం సాయంత్రం వారిద్దరు దాదాపు రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. సానియా ఫోర్‌హ్యాండ్ స్థానంలో అడగా, పేస్ బ్యాక్ హ్యాండ్‌పై దృష్టి కేంద్రీకరించాడు. వారి బాడీ లాంగ్వేజ్ పూర్తి ప్రొఫెషనల్‌గా కనిపించింది.
ప్రాక్టీస్ సెషన్ తర్వాత లియాండర్ పేస్ మీడియాతో మాట్లాడాడు. తన భాగస్వామి సౌకర్యంగా ఉండాలని కోరుకుంటానని, ఏ సైడ్ ఆడుతున్నాననేది తనకు ముఖ్యం కాదని, బ్యాక్ హ్యాండ్‌లో ఆడి లీసా రేమండ్‌తో కలిసి వింబుల్డన్ గెలిచానని అతను అన్నాడు.
ఫోర్ హ్యాండ్ సైడ్ తనకు బాగా ఉంటుందని, రిటర్నింగ్ తన బలమని, తాను లియాండర్‌కు గరిష్ట స్థాయిలో సాయపడుతానని సానియా చెప్పిది. గత నెలలో తనను చాలా అగౌరవపరిచారని, అయితే అదంతా గతమని, తాను ఇప్పుడు తన దేశం కోసం, తన పార్ట్నర్స్ కోసం ఆడుతానని ఆయన అన్నాడు.
గతాన్ని సానియా కూడా పెద్ద పట్టించుకోవడం లేదు. ఒలింపిక్స్ గానీ వింబుల్డన్ గానీ లియాండర్ పేస్ దేశం కోసం తన సత్తాను ప్రదర్శించాడని, తామిద్దరం ఈసారి అది సాధించగలమనే ఆశ ఉందని, జీవిత కాలంలో ఇటువంటి అవకాశం మళ్లీ రాదని ఆమె అన్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications