ముర్రె Vs సెరెనా తర్వాత షరపోవాతో సై అన్న జకోవిచ్

సెరెనా విలియమ్స్‌తో తలపడితే తాను ఒడిపోక తప్పదని ట్వీట్ చేశాడు. ముర్రేపై సెరెనా విజయం సాధించగలదని ఓ అభిమాని పోస్ట్ చేసిన వ్యాఖ్యకు ముర్రే స్పందించాడు. అతని అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తున్నానని ప్రకటించాడు. అయితే అదే సమయంలో సెరెనాతో పోటీకి సిద్ధమని ప్రకటించాడు. దీనికి సెరెనా కూడా స్పందించారు. ముర్రే ఆడతానంటే తాను సై అన్నారు.
పోటీకొచ్చిన జకోవిచ్
సెరెనా విలియమ్స్‌తో ఓ మ్యాచ్ లాస్ వెగాస్‌లో ఆడడానికి తాను సిద్ధమని ముర్రె ప్రకటించడంతో తాను సైతం సిద్ధమని ప్రపంచ నెంబర్ వన్ జకోవిచ్ అన్నాడు. ఐతే ఈ సెర్బియన్ ఆటగాడు సెరెనా విలియమ్స్‌తో కాకుండా రష్యా ముద్దుగుమ్మ మరియా షరపోవాతో ఆడేందుకు సై అన్నాడు.
మరాయతోనైతే ప్రపంచంలో ఏ వేదిక పైన అయినా టోర్నీ నుంచి ఆడుతానని జకోవిచ్ అన్నాడు. క్వాలిఫయర్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించిన షరపోవా... ఇక జకోవిచ్ ప్రతిపాదనకు స్పందించాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications