For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివరి నిమిషంలో మార్చలేం: సానియాకే ఖేల్ రత్న..!

By Nageswara Rao

న్యూఢిల్లీ: సానియా మిర్జా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందుకుంటుందా లేదా అన్న విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. శనివారం నాడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో సానియా మిర్జాకు ఖేల్‌రత్న ప్రదానం చేయనున్నారు.

యుఎస్ ఓపెన్ కోసం అమెరికాలో ఉన్న సానియా ఖేల్ రత్న పురస్కారం అందుకోవడం కోసమే శుక్రవారం ఢిల్లీకి వచ్చింది. అవార్డు ప్రదానోత్సవానికి సంబంధించిన రిహార్సల్స్‌లో ఆమె పాల్గొంది. సానియా మిర్జాకు పురస్కారాన్ని ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయంపై పారా ఒలింపియన్ హెచ్ఎన్ గిరీషా వేసిన పిటిషన్ పై స్పందించిన కర్ణాటక హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం, తాము ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి వున్నట్టు స్పష్టం చేసింది. టెన్నిస్ రంగంలో మహిళల డబుల్స్ విభాగంలో టాప్ ర్యాంకులో ఉన్న సానియా ఈ అవార్డుకు అర్హురాలని తేల్చింది.

Sorry, Girisha: Whichever way you look at it, Sania Mirza has earned the Khel Ratna award

అవార్డు విజేతల వివరాలను చివరి నిమిషంలో మార్చలేమని, అవార్డు కమిటీ సిఫార్సుల మేరకు సానియాకు అవార్డు ఇస్తామని, ఈ నిర్ణయమే ఫైనల్ అని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కేంద్రానికి హైకోర్టు నోటీసులు అందిన మాట నిజమేనని ధ్రువీకరించిన ఆ అధికారి నిర్ణీత గడువు 15 రోజుల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో సానియాతోపాటు రాష్ట్రానికి చెందిన ఎస్‌పీ మిశ్రా (టెన్నిస్‌) ద్రోణాచార్య, కిడాంబి శ్రీకాంత్‌ (బ్యాడ్మింటన్‌), అనూప్‌ కుమార్‌ (రోలర్‌ స్కేటింగ్‌) అర్జున అవార్డులను స్వీకరిస్తారు. స్పోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌కు రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ అవార్డును అందజేస్తారు.

క్రీడాకారులకు, శిక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళి అర్పించారు. ట్విట్టర్లో వివిధ క్రీడా విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులకు అదేవిధంగా శిక్షకులకు, క్రీడా ఔత్సహికులకు శుభాకాంక్షలు. క్రీడలకు మీరు చూపే ప్రతిభ, చేసే ప్రయత్నాలు, అందించే సహాకారం చూసి మేం గర్వపడుతున్నాం. దేశంలో క్రీడలు, క్రీడాస్ఫూర్తి వెలగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+