For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్నిస్ మ్యాచ్ ఫిక్సింగ్: ఆరుగురు ఆస్ట్రేలియన్ల అరెస్ట్

కాన్‌బెర్రా: ఇప్పటి వరకు క్రికెట్లోనే ఎక్కువగా కనిపించే మ్యాచ్ ఫిక్సింగ్.. ఇప్పుడు టెన్నిస్ ఆటకు పాకింది. టెన్నిస్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఆస్ట్రేలియన్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో టెన్నిస్ ఆటగాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీని ఫిక్సింగ్ చేసేందుకు ఈ ఆరుగురు ఆస్ట్రేలియన్లు ప్రయత్నించారు. వీరిని మెల్ బోర్న్, విక్టోరియా పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Six Australians nabbed from 'tennis match-fixing ring'

విక్టోరియా పట్టణంలో ముఠాగా ఏర్పడిన కొంతమంది ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. ఈ ఫిక్సింగ్ ముఠా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడుతోందని ఆయన వెల్లడించారు.

వీరు టెన్నిస్ ఆటగాళ్లనే లక్ష్యంగా చేసుకుని ఫిక్సింగ్ చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. కాగా, ఫిక్సింగ్ అనేది క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకమని, క్రీడా స్ఫూర్తికి భంగం కలిగించే చర్యలు చేపట్టే వారిపై కఠిన చర్యలుంటాయని టెన్నిస్ ఆస్ట్రేలియా హెచ్చరించింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+