
హైదరాబాద్: సోమవారం ప్రకటించిన డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో రొమేనియాకు చెందిన సిమోనా హలెప్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన కరోలినా వోజ్నియాకి గాయం కారణంగా దుబాయి ఛాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకోవడంతో రెండో స్థానానికి దిగజారింది.
వోజ్నియాకితో పోలిస్తే నెంబర్ వన్ స్థానంలో ఉన్న హలెప్ 400 పాయింట్లతో మెరుగ్గా ఉంది. దుబాయి ఛాంపియన్‌షిప్స్‌లో సెమీ ఫైనల్స్ వరకు వెళ్లిన ముగురుజా మూడో స్ధానంలో నిలిచింది. ఇక, దుబాయి విజేతగా నిలిచిన ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్టిటోలినా నాలుగో స్ధానాన్ని దక్కించుకుంది.
ఫిబ్రవరి 26 నాటికి డబ్ల్యూటీఏ ర్యాంకులు ఇలా:
1. Simona Halep (ROM) 7,965 points (+1)
2. Caroline Wozniacki (DEN) 7,525 (-1)
3. Garbiñe Muguruza (ESP) 6,175
4. Elina Svitolina (UKR) 5,480
5. Karolína Plísková (CZE) 5,080
6. Jelena Ostapenko (LAT) 5,000
7. Caroline Garcia (FRA) 4,625
8. Venus Williams (USA) 4,277
9. Petra Kvitová (CZE) 3,086 (+1)
10. Angelique Kerber (GER) 3,055 (-1)
11. Johanna Konta (GBR) 2,930 (+1)
12. Julia Görges (GER) 2,910 (-1)
13. Sloane Stephens (USA) 2,813
14. Kristina Mladenovic (FRA) 2,725
15. Madison Keys (USA) 2,703
16. Ashleigh Barty (AUS) 2,486 (+1)
17. Coco Vandeweghe (USA) 2,433 (+1)
18. Magdaléna Rybáriková (SVK) 2,405 (+1)
19. Svetlana Kuznetsova (RUS) 2,362 (+1)
20. Darya Kasatkina (RUS) 2,300 (+4)