న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి సిమోనా హలెప్‌ ఔట్‌.. కారణం ఏంటంటే!!

Simona Halep Pulls Out of French Open 2021 Due to Calf Injury

బుకారెస్ట్‌: టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరమైన స్టార్‌ ప్లేయర్ల జాబితా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ భయం, గాయాల కారణంగా ఒక్కక్కరు టోర్నీకి దూరమవుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో 2015 చాంపియన్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌), మాజీ నంబర్‌వన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) ఈ మెగా ఈవెంట్‌కు దూరం కాగా .. తాజాగా మహిళల సింగిల్స్‌లో 2018 చాంపియన్, మూడో ర్యాంకర్‌ సిమోనా హలెప్‌ బరిలోకి దిగడంలేదని ప్రకటించింది.

ఐపీఎల్ 2021 వాయిదా పడకపోతే.. నేనే వెళ్లిపోయేవాడిని: టీమిండియా బౌలర్ఐపీఎల్ 2021 వాయిదా పడకపోతే.. నేనే వెళ్లిపోయేవాడిని: టీమిండియా బౌలర్

కాలిపిక్క గాయం కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరమవుతున్నట్లు సిమోనా హలెప్‌ తెలిపింది. 'టోర్నీకి దూరమడవం చాలా బాధగా ఉంది. అయితే నేను గాయం నుంచి కోలుకోవడంపై పూర్తిగా దృష్టిసారిస్తా. సానుకూల దృక్పథంతో ముందుకు సాగి వీలైనంత త్వరగా మళ్లీ కోర్టులో అడుగుపెడతా' అని రొమేనియా ప్లేయర్‌ హలెప్‌ వెల్లడించింది. హలెప్‌ 2018లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకుంది. ఈనెల 30న ఫ్రెంచ్‌ ఓపెన్‌ మొదలవుతుంది.

జెనీవా ఓపెన్‌ ఏటీపీ-250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)-ఫ్రాంకోస్కుగర్‌ (క్రొయేషియా) పోరాటం ముగిసింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ బోపన్న-స్కుగర్‌ ద్వయం 3-6, 6-3, 11-13తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో గొంజాలో ఎస్కోబార్‌ (కొలంబియా)-ఏరియల్‌ బెహర్‌ (ఉరుగ్వే) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జంటకు 4,710 యూరోల (రూ. 4 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 45 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Story first published: Saturday, May 22, 2021, 10:41 [IST]
Other articles published on May 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X