For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో సారి ప్రపంచ నెం.1 స్థానం దక్కించుకున్న హలెప్

Simona Halep earns 2nd straight year-end No. 1 ranking

న్యూఢిల్లీ: మరోసారి రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ మహిళల సింగిల్స్ టాపర్‌గా నిలిచింది. మహిళల టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఎ) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సిమోనా హాలెప్‌ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 2018 సంవత్సరంలో సిమోనా కెరీర్ బెస్ట్ ఫెర్ఫామెన్స్‌‌తో అలరించింది. రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరి ఓ టైటిల్ సాధించింది.

డబ్ల్యూటీఏ ట్రోఫీలతో పాటు యేటా సింగపూర్ వేదికగా జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్స్‌కు వరుసగా 5వ సారి అర్హత సాధించింది. 2018 ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరి మొదటిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. దాంతో పాటుగా ఇదే యేడాది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది.

ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ నెగ్గి తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ముద్దాడింది. ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు మాంట్రియల్ ఓపెన్, రోజర్స్ కప్, షెంజెన్ ఉమెన్స్ సింగిల్స్ ట్రోఫీలు సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో 8921 రేటింగ్ పాయింట్స్‌తో ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనికి గానూ 2018 సంవత్సరానికి ఇయర్ ఎండ్ నెంబర్ వన్ ర్యాంకర్‌గా నిలిచింది.

2017 యేడాది చివరిలోనూ సిమోనానే మహిళల సింగిల్స్ టాప్ ర్యాంకర్‌గా నిలవడం విశేషం. డబ్ల్యూటీఎ ర్యాంకింగ్స్‌లో 38 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకర్‌గా కొనసాగింది.26 ఏళ్ల సిమోనా హాలెప్ 2019లోనూ ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే యేడాదిలోపే కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Story first published: Wednesday, October 17, 2018, 16:04 [IST]
Other articles published on Oct 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+