హైదరాబాద్: టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, స్విస్ పార్టనర్ మార్టినా హింగిస్ యూఎస్ ఓపెన్లో ప్రభంజనం సృష్టిస్తుంటే వారి ఆటను సెక్సీ బ్యూటీ శ్రియా శరన్ చూసి ఎగిరి గంతేసింది. ఈ అందాల భామ క్రీడాకారిణి సానియా అతిథిగా అక్కడికి వెళ్లి ఆటను ఆస్వాదించింది.
మ్యాచ్ ను చాలా దగ్గరగా చూశానని, సానియా మీర్జా గెలిచినందుకు తనకు ఎంతో సంతోషం వేసిందని చెప్పుకొచ్చింది. సానియా, శ్రియా గత కొన్నేళ్లుగా స్నేహం చేస్తున్నారని సమాచారం. సానియా మీర్జా, మార్టినా హింగిస్ మూడు వరుస సెట్లలో ప్రత్యర్థులపై విరుచుకుపడి విజయం సాధించారు.

ఆ విజయం ద్వారా సానియా జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఆటను శ్రియా శరన్ చూసి మురిసిపోయింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో తన ఫొటోలతో పాటు సానియా, హింగిస్ ఫొటోలను కూడా పెట్టింది. వారిద్దరిని ఆమె అభినందించింది.
కొన్నేళ్లుగా సానియాతో శ్రియా శరన్ స్నేహం చేస్తోంది. వారిద్దరు మంచి మిత్రులుగా మారిపోయారు. సానియా మీర్జా ఆటను చూడడానికి సెక్సీ భామ కొంత సమయం వెచ్చించింది. మొత్తం మీద, ఆ ఆటకు శ్రియా శరన్ ఎంతో ఆనందించిందనే చెప్పాలి.
ఫైనల్లోకి సానియా జోడీ
యుఎస్ టోర్నీ డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా మీర్జా వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తోంది. మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో సానియా-హింగిస్ జంట సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది.
ఇటలీకి చెందిన ఎర్రానీ, పెన్నెటా జంటతో తలపడిన సానియా జోడీ 6-4, 6-1 స్కోరు తేడాతో వరుస సెట్లతో గెలుపొందింది. తద్వారా యూఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్లో దూసుకెళ్లింది. ఇక ఫైనల్లో నాలుగో సీడ్ జోడీ కసే దెల్లాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లానా ష్వెదోవా (కజగిస్థాన్) లేదా అన్నా-లీనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)- కోకో వాందెవెగ్వే (అమెరికా) జోడీతో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.