హైదరాబాద్: యుస్ ఓపెన్‌లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి మరియా షరపోవా తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. డోపింగ్ టెస్టులో పట్టుబడి 15 నెలల పాటు నిషేధానికి గురైన అనంతరం తాను ఆడిన మేజర్ టోర్నీలో అదరగొట్టింది. యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ సిమోనా హలెప్‌ను ఓడించింది.
మంగళవారం తెల్లవారుజామున సర్ ఆర్ధర్ ఆషే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ఆద్యంత మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. సుమారు మూడు గంటల పాటు సాగిన పోరులో మరియా షరపోవా 6-4, 4-6, 6-3తేడాతో సిమోనా హలెప్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ని 24వేల మందికి పైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు.

ఈ తీవ్ర ఒత్తిడికి లోనైన హలెప్ మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. దీంతో మరియా షరపోవా గెలుపును నమోదు చేసుకుంది. ప్రస్తుతం షరపోవా ర్యాంక్ 146. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె మెయిన్ డ్రాలో చోటు సంపాదించింది. మ్యాచ్ అనంతరం షరపోవా మాట్లాడుతూ గెలవాలనే పట్టుదలతోనే బరిలోకి దిగానని అంచనాలకు మించి రాణించాననే ఆనందం లభించిందని తెలిపింది.
ఇదే యుఎస్ ఓపెన్‌ని 2006లో షరపోవా కైవసం చేసుకుంది. 2014 తర్వాత ఈ వేదికపై షరపోవా ఆడటంతో ఆమె మ్యాచ్‌ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున టెన్నిస్ అభిమానులు తరలివచ్చారు. షరపోవా విజయానంతరం ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లతో ఆమెకు అభినందనలు తెలిపారు. రెండో రౌండ్‌లో వరల్డ్ నెంబర్ 59 ప్లేయర్ టిమి బాబోస్‌తో షరపోవా తలపడనుంది.
STATISTICAL BREAKDOWN Sharapova beat Halep 6-4 4-6 6-3
WINNERS/UNFORCED ERRORS Sharapova - 60/54 Halep - 15/14
ACES/DOUBLE FAULTS Sharapova - 7/7 Halep - 1/4
BREAK POINTS WON Sharapova - 5/22 Halep - 4/10
FIRST SERVE PERCENTAGE Sharapova - 58 Halep - 67
PERCENTAGE OF POINTS WON ON FIRST/SECOND SERVE Sharapova - 65/47 Halep - 62/38
TOTAL POINTS Sharapova - 113 Halep - 108