యుఎస్ ఓపెన్: అలవోక విజయం, ప్రిక్వార్టర్స్‌కు షరపోవా
హైదరాబాద్: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడెడ్‌లు ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమిస్తుంటే, మాజీ వరల్డ్ నెంబర్ వన్ రష్యాకు చెందిన మరియా షరపోవా మాత్రం వరుస విజయాలతో తన జోరును కొనసాగిస్తోంది. డోపింగ్ కారణంగా దాదాపు 15 నెలలు పాటు ఆటకు దూరమైనా తన ఆటలో ఏ మాత్రం వన్నె తగ్గలేదని షరపోవా మరోసారి నిరూపించుకుంది.
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా యుఎస్ ఓపెన్ బరిలో దిగిన షరపోవా ప్రిక్వార్టర్స్‌కు చేరింది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో షరపోవా 7-5, 6-2 తేడాతో యూఎస్ టీనేజర్ సోఫియా కెనిన్ పై అలవోక విజయాన్ని సాధించారు. 12వ గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించి తొలి సెట్ గెలుచుకున్న షరపోవా రెండో సెట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
తొలి సెట్‌లో అనేక విన్నర్స్‌ను సాధించిన షరపోవా అనేక అనవసర తప్పిదాలను కూడా చేసింది. దీంతో 7-5 తేడాతో మాత్రమే తొలి సెట్‌ను షరపోవా కైవసం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో సోఫియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. మ్యాచ్‌లో 8 ఏస్‌లు సంధించిన షరపోవా 38 విన్నర్లు సాధించింది.
ప్రిక్వార్టర్స్‌లో షరపోవా.... అనస్తిజా సెలవటోవాతో తలపడనుంది. డోపింగ్ నిషేధం ముగించుకుని ఏప్రిల్‌లో పునరాగమనం చేశాక ఆమెకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కావడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్), మూడో సీడ్ ముగురుజ (స్విట్జర్లాండ్), తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) కూడా ముందంజ వేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications