Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లాకర్‌ రూమ్‌లో వెక్కివెక్కి: సెరెనాతో శత్రుత్వంపై తన బయోగ్రఫీలో షరపోవా

హైదరాబాద్: మరియా షరపోవా, సెరెనా విలియమ్స్‌లు ఆటతో పాటు అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. గత దశాబ్ద కాలంగా మహిళల టెన్నిస్‌కు ఎక్కడలేని క్రేజ్‌ తీసుకొచ్చారు. రష్యాకు చెందిన మరియా షరపోవా గెలిచిన గ్రాండ్ స్లామ్‌లు తక్కువ అయినప్పటికీ, సెరెనాకు సమకాలీనురాలు.

వీరిద్దరూ పోటీ పడిన 21 మ్యాచ్‌లలో 19 సార్లు సెరెనా విలియమ్స్ గెలిచినప్పటికీ, వీరి పోరుపై ఇప్పటికీ ఆసక్తి తగ్గలేదు. అనేక సందర్భాల్లో కోర్టు బయట కూడా వీరిద్దరు పరస్పర విమర్శలతో ఎన్నో సార్లు వార్తల్లో నిలిచారు. తాజాగా విడుదలైన తన ఆటోబయోగ్రఫీ 'అన్‌ స్టాపబుల్‌ -మై లైఫ్‌ సో ఫర్‌'లో షరపోవా, సెరెనాపై తన విద్వేషాన్ని మరోసారి ప్రదర్శించింది.

సెరెనాను ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో తాను ఓడించడం, ఆ ఓటమి బాధతో ఆ నల్లకలువ లాకర్‌ రూమ్‌లో వెక్కివెక్కి ఏడ్వడాన్ని తన ఆటోబయోగ్రఫీ మారియా షరపోవా వివరించింది. 2004 వింబుల్డన్‌ ఫైనల్లో సెరెనాను ఓడించి షరపోవా విజేతగా నిలిచింది. అప్పటికి షరపోవా 17 ఏళ్ల టీనేజర్‌.

డిఫెండింగ్‌ ఛాంపియన్ అయిన సెరెనానే అందరి ఫేవరెట్‌. కానీ టాప్‌సీడ్‌ సెరెనాను చిత్తుచేసి షరపోవా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని 'ఎప్పటికీ గుర్తుంచు కోదగ్గ అనూహ్య పరాజయం'గా మీడియా అభివర్ణించింది. అంతేకాదు సెరెనాకు సిసలైన ప్రత్యర్థి ఆవిర్భవించిందని కూడా జోస్యం చెప్పింది.

ఓటమి వారిని భయానికి లోను చేసింది

ఓటమి వారిని భయానికి లోను చేసింది

‘టెన్నిస్‌ కోసమే పుట్టారా అన్నట్టుగా భావించిన ఆ సిస్టర్స్‌లో ఒకరి ఓటమి వారిని భయానికి లోనుచేసి ఉంటుంది' అని బయోగ్రఫీలో షరపోవా రాసుకుంది. వింబుల్డన్‌లో ఆమెను ఓడించినందుకు సెరెనా తనను ఎంతో ద్వేషించి ఉంటుందని పే ర్కొంది. బహుశా ఆ ఘటన తనపై ఆధిపత్యం చెలాయించాలన్న కసిని సెరెనాలో పెంచి ఉంటుందని అభిప్రాయపడింది.

సెరెనా నాపై ద్వేషం పెంచుకుంది

సెరెనా నాపై ద్వేషం పెంచుకుంది

‘వింబుల్డన్‌లో అనేక అవాంతరాలను అధిగమించి నాలాంటి ఒక శ్వేత వర్ణపు క్రీడాకారిణి ఆమెను ఓడించడం వల్లే సెరెనా నాపై ద్వేషం పెంచుకుంది. లాకర్‌ రూమ్‌లో ఆమె ఏడవటం కూడా నేను చూశాను. అది ఆమెను మరింతగా బాధపెట్టి ఉంటుంది. ఇన్నేళ్ల పాటు ఆమెను ఓడించడంలో నేను సఫలం కాలేకపోయాను. ఇంకా చెప్పాలంటే తన భారీ, బలమైన శరీరంతోనే ఆమె నన్ను భయపెట్టేసేది' అని షరపోవా తన బయోగ్రఫీలో రాసుకొచ్చింది.

ఆరేళ్ల వయసులోనే రష్యా నుంచి ఫ్లోరిడాకు

ఆరేళ్ల వయసులోనే రష్యా నుంచి ఫ్లోరిడాకు

టెన్నిస్‌ కెరీర్‌ కోసం ఆరేళ్ల వయసులోనే తాను రష్యా నుంచి ఫ్లోరిడాకు వెళ్లిన వైనాన్ని కూడా షరపోవా పుస్తకంలో వివరించింది. అక్కడ తాను సెరెనా సోదరీమణులను రహస్యంగా చూసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ‘వారిని ఆరాధించాలని గానీ, వారి అభిమానిగా ఉండాలని అప్పట్లోనే అనుకోలేదు' అని చెప్పుకొచ్చింది.

మా మధ్య విరోధానికి కారణం అదే

మా మధ్య విరోధానికి కారణం అదే

ఒకరిని మించి మరొకరు రాణించాలనే తలంపే బహుశా మా మధ్య విరోధానికి కారణమని సెరెవా విలియమ్స్ చెప్పుకొచ్చింది. అంతేకాదు పరోక్షంగా తాను అందమైన, సున్నితమైన దానినని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాటలపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమర్శలు వినిపించాయి.

క్రీడా విశ్లేషకులు ఘాటు వ్యాఖ్యలు

క్రీడా విశ్లేషకులు ఘాటు వ్యాఖ్యలు

23 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన సెరెనాతో 5 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మరియా షరపోవాకు అసలు పోలికే లేదని క్రీడా విశ్లేషకులు ఘాటుగా వ్యాఖ్యానించారు. సెరెనాను విమర్శించే క్రమంలో ఈ పుస్తకంలో ఏకంగా 106 సార్లు ఆమె పేరును షరపోవా ప్రస్తావించిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+