యుఎస్ ఓపెన్: ఓటమితో షరపోవా టోర్నీ నుంచి నిష్క్రమణ
హైదరాబాద్: యుఎస్ ఓపెన్‌లో రష్యా టెన్నిస్ స్టార్ మరయా షరపోవా పోరు ముగిసింది. మహిళల సింగిల్స్‌లో నాలుగో రౌండ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లాత్వియన్‌కు చెందిన అనస్తాసిజా సెవస్తోవాతో తలపడగా 5-7, 6-4, 6-2 తేడాతో షరపోవా ఓడింది.
ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ విజేత, మాజీ ఛాంపియన్‌ను ఓడించిన అనస్తాసిజా క్వార‍్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అమెరికాకు చెందిన స్లోయెన్ స్టీఫెన్స్‌తో క్వార‍్టర్‌లో అనస్తాసిజా తలపడనుంది. 30 ఏళ్ల షరపోవా ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత డోపింప్ ఆరోపణలతో 15 నెలల పాటు నిషేధం ఎదుర్కొని ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది.

రీఎంట్రీ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత అడిన షరపోవా, వింబుల్డన్ టోర్నీ నుంచి గాయం కారణంగా తప్పుకుంది. న్యూయార్క్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో కూడా వైల్డ్ కార్డు ద్వారా ఆమె ఆడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆరంభంలో అదరగొట్టిన షరపోవా చివరకు ఓటమితో అభిమానులను నిరాశపరిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications