For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్వేగానికి లోనైన సానియా మిర్జా: షారుఖ్ చేతుల మీదగా ఆటోబయోగ్రఫీ

By Nageshwara Rao

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆటోబయోగ్రఫీ పుస్తకం 'ఏస్‌ ఎగనెస్ట్‌ ఆడ్స్‌'ని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న షారుఖ్ మాట్లాడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటే మాటలు కాదని అన్నారు.

కుటుంబం కన్న కలలను సాకారం చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న అంశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కానీ, సానియా మిర్జా ఆ పనిని అవలీలలగా చేసిందని చెప్పుకొచ్చారు. సానియా మిర్జా ఓ క్రీడాకారిణి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని షారూఖ్ వ్యాఖ్యానించారు.

Shah Rukh Khan to unveil Sania Mirza's autobiography in Hyderabad

చిన్నవయసులోనే ఆత్మకథ పూర్తిచేయగలిగినంత అనుభవాన్ని సానియా సంపాదించుకుందని షారూఖ్ సరదాగా అన్నారు. సానియా జీవితాన్ని ఓ సినిమాగా తీస్తే అది మరింతమందిలో స్పూర్తి నిలిపే అవకాశం ఉందని షారూఖ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి జీవితాలపై మరిన్ని సినిమాలు రావాలని షారుఖ్ అన్నారు.

అనంతరం సానియా మిర్జా మాట్లాడుతూ తన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన బాద్‌షాకు సానియా కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని అన్నారు. టెన్నిస్ ప్లేయర్‌గా ఎదగడానికి ఎంతో శ్రమించానని చెప్పుకొచ్చారు.

వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు‌ని సాధించడం నాలైఫ్‌లో మరిచిపోలేనని చెప్పిన సానియా ప్రస్తుతం తన దృష్టంతా రియో ఒలింపిక్స్‌పైనే ఉందని వ్యాఖ్యానించారు. తనకు ఇప్పటికే మూడు సర్జరీలు అయ్యాయని చెబుతూ కాస్తంత ఉద్వేగానికి లోనయ్యారు. 2010లో జరిగిన సర్జరీతో టెన్నిస్ కేరీర్‌కు పుల్‌స్టాప్ పడుతుందని అనుకున్నానని అన్నారు, మూడు వారాల పాటు నాలుగు గోడల మధ్య బెడ్‌కే పరిమితమయ్యానని అన్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 17న ముంబైలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. నిజానికి ఈ పుస్తకం గత వారమే విడుదలైందని సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా చెప్పారు. ఆటోబయోగ్రఫీ రాయాలన్న ఆలోచన సానియాదేనని.. పూర్తి కావడానికి దాదాపు ఐదేళ్లు పట్టిందని ఆయన తెలిపారు. సానియా తన బయోగ్రఫీని రాయడంలో ఇమ్రాన్‌ కూడా సహకారం అందించారు.

'ఇప్పటి వరకు సానియా జీవితంలో జరిగిన విషయాలు, ఆమె అభిప్రాయాలను పుస్తకంలో పొందుపరిచాం. కెరీర్‌కు సంబంధించిన అన్ని వివరాలు.. వివాదాలతో సహా' అని ఇమ్రాన్‌ తెలిపారు. మిగతా నగరాల్లో కూడా సానియా బయోగ్రఫీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కూడా పాల్గొనున్నారు.

40 అధ్యాయాలు ఉన్న ఆటోబయోగ్రఫీలో సానియా 4-5 ఏళ్ల వయసులో జరిగిన సంఘటనల నుంచి కథ ఆరంభమవుతుందని ఇమ్రాన్‌ మిర్జా చెప్పారు. ప్రముఖ సంస్థ హూపర్ కొలిన్స్ పబ్లికేషన్‌లో వచ్చిన 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' బుధవారం నుంచి పుస్తకాల షాపుల్లో లభించనుంది.

Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+