For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లిగా తప్పుకుంటున్నా టెన్నిస్ నుంచి కాదు: సెరెనా విలియమ్స్

Serena Williams withdraws from Australian Open 2018, says not yet 'prepared to go all the way'

హైదరాబాద్: టెన్నిస్ క్రీడలో ఓ సంచలనం. ప్రపంచ టెన్నిస్ తారలలో ఒకరైన సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్‌లో ఆండీ ముర్రే, కీ నిషికోరి లతో పాటుగా తను కూడా తప్పకుంటున్నట్లు ప్రకటించింది.

గతేడాది సెప్టెంబరు నెలలో మొదటి సంతానానికి జన్మనిచ్చింది. తను ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్నప్పుడే మెల్ బౌర్న్ పార్క్‌లోని 23వ గ్రాండ్ స్లామ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడింది. ఇందులో టైటిల్ గెలుచుకుని ఓపెన్ ఎరా రికార్డును సొంతం చేసుకుంది. మళ్లీ అబుదాబిలో డిసెంబరు నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌లో పాల్గొంది. ఇందులో పరాజయం పాలవడంతో ప్రస్తుతం ఏ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా లేనంటుంది.

నా కోచ్‌తో పాటు సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు ఇంకొంచెం ఫిట్‌నెస్ మెరుగైన తర్వాత మళ్లీ కోర్టులోకి అడుగుపెడదామనుకుంటున్నాను. అప్పటివరకు టోర్నమెంట్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అని పేర్కొంది.

కాగా, ఆండీ ముర్రే కొద్ది నెలలుగా తొంటికి గాయం కావడంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. నిషికొర్రి మణికట్టుకు గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 5, 2018, 11:19 [IST]
Other articles published on Jan 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+