For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింబుల్డన్ ఫైనల్స్: సెరెనాపై కెర్బర్ ప్రతీకారం తీర్చుకునేనా?

By Nageshwara Rao
Serena Williams vs Angelique Kerber: What will decide Wimbledon 2018 final?

ఫైనల్లో సెరెనా గెలిస్తే టెన్నిస్‌ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు (24) గెలిచిన క్రీడాకారిణిగా మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది.

హైదరాబాద్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టైటిల్ సాధించడానికి ఒక్క అడుగుదూరంలో నిలిచింది. వింబుల్డన్ 2018 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో జర్మన్ స్టార్ ఏంజెలిక్ కెర్బర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఆరు సార్లు వింబుల్డన్ టైటిళ్లను నెగ్గిన సెరెనా, 7వ సారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది.

Serena Williams vs Angelique Kerber: What will decide Wimbledon 2018 final?

ఈ టైటిల్ సెరెనా విలియమ్స్‌కు 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కాగా... మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డుని కూడా సమం చేస్తుంది. ఈ టోర్నీలో తొలి రౌండ్ నుంచే ఆధిపత్యం ప్రదర్శించి సెరెనా విలియమ్స్ ఒక్క సెట్ మాత్రమే కోల్పోయి ఫైనల్‌ చేరింది. మరోవైపు జర్మనీ సంచలనం ఏంజెలికా కెర్బర్‌ కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఉంది.

వింబుల్డన్‌ ఫైనల్లో వీరిద్దరు ముఖాముఖీ తలపడడం ఇది రెండోసారి. 2000లో తొలి సారి వింబుల్డన్ టైటిల్ నెగ్గిన సెరెనా.. 2016లో 6వ సారి చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్ల క్రితం 2016లో ఇక్కడే సెరెనాతో జరిగిన టైటిల్‌ పోరులో ఓడిన 30 ఏళ్ల కెర్బర్‌ ఈసారి మాత్రం అవకాశాన్ని వదులుకోరాదన్న పట్టుదలతో ఉంది.

గతంలో 9సార్లు వింబుల్డన్‌ ఫైనల్‌ చేరిన సెరెనా.. ఏకంగా ఏడుసార్లు విజేతగా నిలిచింది. ముఖాముఖీ రికార్డులోనూ 6-2తో సెరెనాదే పైచేయి. గ్రాండ్‌స్లామ్స్‌లోనూ కెర్బర్‌పై 2-1 రికార్డుతో సెరెనా ముందంజలో ఉంది. ప్రస్తుత టోర్నీలో సెరెనా జోరు చూస్తుంటే వింబుల్డన్ సాధించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్లో సెరెనాను చిత్తుచేసి తొలి గ్రాండ్‌స్లామ్‌ అందుకున్న కెర్బర్‌.. ఆ ప్రదర్శనను పునరావృతం చేసి గత వింబుల్డన్‌ ఫైనల్‌ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి మరి.

Story first published: Saturday, July 14, 2018, 11:00 [IST]
Other articles published on Jul 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+