Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పునరాగమనం: రాకెట్ పట్టేందుకు సిద్ధమైన సెరెనా

Serena Williams 'very likely' to defend Australian Open title

హైదరాబాద్: అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మళ్లీ రాకెట్‌ పట్టేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు పూర్తిగా దూరంగా ఉంది. జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పునరాగమనాన్ని ఘనంగా చాటాలని ఆరాట పడుతున్నట్లు టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు.

ఈ ఏడాది జనవరిలో మూడునెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ గెలిచిన 36 ఏళ్ల సెరెనా ఆ తర్వాత ఏ ఒక్క టోర్నీలో కూడా పాల్గొనలేదు. అనంతరం సెప్టెంబర్‌లో ఓ పాపకు జన్మనిచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగి పూర్వ వైభవాన్ని చాటాలని చూస్తోంది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ డైరెక్టర్ గ్రెయిగ్ టైలీ హెరాల్డ్ సన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ 'సెరెనాకు వీసా లభించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో సెరెనా మళ్లీ బరిలోకి దిగుతుంది. ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి మార్గరెట్ రికార్డును అధిగమిస్తుంది' అని అన్నారు.

23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరెవా విలియమ్స్ ఇటీవలే రిడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహనియన్‌ను పెళ్లాడింది. అమెరికాలోని న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్‌ సెంటర్‌‌లో వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మిలియన్‌ డాలర్లు ఖర్చు అయింది. వీరి పెళ్లికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

ఈ ఏడాది జనవరిలో తాను గర్భవతినని ప్రకటించిన సెరెనా సెప్టెంబరు 1న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాప పేరు అలెక్సిస్‌ ఒలింపియా.

Story first published: Thursday, December 7, 2017, 10:36 [IST]
Other articles published on Dec 7, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+