అదే షాట్లు.. అంతే స్పీడుతో సెరెనా విలియమ్స్, ఇబ్బందుల నుంచి గట్టెక్కిన నాదల్

హైదరాబాద్: మాజీ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ గ్రాండ్‌స్లామ్ పునరాగమనాన్ని విజయవంతంగా నమోదు చేసింది. తొలి రౌండ్లో ఆమెకు గట్టి పోటీ ఎదురైనా.. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా వైల్డ్‌కార్డుతో ఎంట్రీ ఇచ్చి తొలిరౌండ్‌లో 7-6 /(7/4), 6-4తో ప్రపంచ 70వ ర్యాంకర్ ప్లిస్కోవా (చెక్)పై గెలిచింది. 2002, 13, 15లో ఇక్కడ టైటిల్స్ గెలిచిన సెరెనా.. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత సెరెనాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్.
గంటా 45 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. సెరెనా, ఫ్లిస్కోవా భారీ సర్వీస్‌లతో చెలరేగారు. మ్యాచ్ మొత్తంలో 28 ఏస్‌లు సంధించిన అమెరికన్.. తొలిసెట్‌లోనే 17 కొట్టింది. టైబ్రేక్‌లో ప్లిస్కోవా 3-0తో ఆధిక్యంలో నిలిచినా.. అనూహ్యంగా పుంజుకున్న సెరెనా వరుసగా ఆరు గేమ్‌లను చేజిక్కించుకుంది. రెండోసెట్‌లో తన సర్వీస్‌లో ఐదు బ్రేక్ పాయింట్లను కాచుకున్న సెరెనా కీలమైన ఐదో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది.

ఇంతకుముందు కూడా ఇలాంటి దుస్తులు
ఆరో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌ను మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. స్కోరు 4-3 ఉన్న దశలో సెరెనా చిన్నచిన్న తప్పిదాలు చేసినా.. పదో గేమ్‌లో అమె కొట్టిన బ్యాక్‌హ్యాండ్ షాట్లకు ప్లిస్కోవా సమాధానం చెప్పలేకపోయింది. తన ఆటతోనే కాదు దుస్తులతోనూ అందరినీ ఆకర్షించింది. ఆమె నల్లని ‘క్యాట్‌సూట్' ధరించింది. సెరెనా ఇంతకుముందు కూడా ఇలాంటి దుస్తులు ధరించినా.. తల్లయిన ఎనిమిది నెలల్లోనే ఈసారి ‘క్యాట్‌సూట్' ధరించడం చర్చనీయాంశమైంది.

షరపోవా (రష్యా) కూడా రెండో రౌండ్‌కు
మరియా షరపోవా (రష్యా) కూడా కష్టంగా రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్లో ఆమె 6-1, 4-6, 6-3తో హాగెన్‌కాంప్ (నెదర్లాండ్స్)పై గెలిచింది. మూడో సీడ్ ముగురుజ (స్పెయిన్), సిబుల్కోవా (స్లొవేకియా), కెర్బర్ (జర్మనీ) కూడా ముందంజ వేశారు.

టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో రౌండ్
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో రౌండ్ చేరేందుకు కష్టపడ్డాడు. గట్టి పోటీ ఎదురైన తొలి రౌండ్లో నాదల్ 6-4, 6-3, 7-6 (11-9)తో సైమన్ బొలెలి (ఇటలీ)పై నెగ్గాడు. పదిసార్లు ఛాంపియన్ నాదల్‌కు రొలాండ్ గారోస్‌లో ఇది 80వ విజయం. ‘తొలి రౌండ్లో నేను చాలా ఇబ్బందిపడ్డా. కానీ ఈ పరీక్ష మంచిదే. సైమన్ మంచి ఆటగాడు' అని మ్యాచ్ అనంతరం నాదల్ వ్యాఖ్యానించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ సిలిచ్ 6-3, 7-5, 7-6 (7-4)తో డక్‌వర్త్‌ను ఓడించాడు. 9వ సీడ్ ఇస్నర్ (అమెరికా), ఆరో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), షపవలోవ్ (కెనడా) కూడా శుభారంభం చేశారు.

నిష్క్రమించిన యుకి:
పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు యుకి బాంబ్రి తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. యుకి 4-6, 4-6, 1-6తో బెల్జియంకు చెందిన రుబెన్ బెమెల్మన్స్ చేతిలో పరాజయానికి గురైయ్యాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో బోపన్న, రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 6-3, 6-1తో టేలర్ ఫ్రిజ్-తియాఫో (అమెరికా) ద్వయాన్ని ఓడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications