ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెరెనా ఓటమి: మార్గరెట్ రికార్డు మరింత ఆలస్యం!

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్‌కు గట్టి షాక్ తలిగింది. గతంలో ఏడు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరీనాను మూడవ రౌండ్‌లో చైనాకు చెందిన వాంగ్ కియాంగ్ ఓడించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో వాంగ్ కియాంగ్ 6-4, 6-7, 7-5 తేడాతో సెరెనాపై నెగ్గింది.
చివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సెరెనా విలియమ్సన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. తాజా నిష్క్రమణతో తన 24వ గ్రాండ్‌స్లామ్ కల మళ్లీ కలగానే మిగిలింది. రెండవ సెట్‌లో 5-4 స్కోర్ వద్ద మ్యాచ్ కోసం వాంగ్ కియాంగ్ సర్వ్ చేసినా సెరీనా మాత్రం తన అనుభవంతో ఆ సెట్‌ను సొంతం చేసుకుంది.
అయితే, హోరా హోరీగా సాగిన మూడవ సెట్‌ను మాత్రం సెరీనా కోల్పోయి ఈ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి సెరెనా నిష్క్రమించింది. ఫలితంగా అత్యధికంగా సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మార్గరెట్ కోర్టు రికార్డును సమం చేసేందుకు సెరీనా విలియమ్స్ మరో గ్రాండ్ స్లామ్ టోర్నీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications