Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాతి వివక్ష: సెరీనా విలియమ్స్, షరపోవా సపోర్ట్

న్యూఢిల్లీ: రష్యా టెన్నిస్ సమాక్య అధ్యక్షుడు దర్పస్పెచ్ తనను, వీనస్‌ను కలిపి 'విలయమ్స్ బ్రదర్స్' గా పిలవడంపై టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఉమెన్స్ టెన్నిస్ అసోషియనేషన్ ఫైనల్స్ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆమె మండిపడింది. దర్పస్పెచ్ చేసిన వ్యాఖ్యలు వివక్షతో కూడుకున్నవిగా అభివర్ణించింది.

"అతనివి కచ్చతంగా లింగ, జాతి వివక్ష చూపించే వ్యాఖ్యలే. అందులో బెదిరింపు కూడా ఉంది" అని సెరీనా పేర్కొంది. "అతడి మాటలు నాలాగే చాలా మందిని బాధించి ఉంటాయి. కానీ డబ్ల్యూటీఏ, యుఎస్‌టీఏ గొప్పగా స్పందించాయి. అలాంటి వ్యాఖ్యలకు ఈ రోజుల్లో తావు లేదు" అని సెరీనా విలియమ్స్ పేర్కొంది.

ఇక సెరీనా విలియమ్స్‌‌పై రష్యా టెన్నిస్ సమాక్య అధ్యక్షుడు దర్పస్పెచ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఉమెన్స్ టెన్నిస్ అసోషియేషన్ (డబ్ల్యూటీఏ) ఆయన్ని 12 నెలలు పాటు సస్పెండ్ చేసి, £15,500 జరిమానా విధించింది. దర్పస్పెచ్ ఐఓసీ మెంబర్‌గా కూడా ఉన్నారు.

Serena Williams Slams Russian Tennis Federation President For “Racist” And “Sexist” Williams “Brothers” Remark

సెరీనా విలియమ్స్‌పై చేసిన అనుచితి వ్యాఖ్యలకు గాను దర్పస్పెచ్ క్షమాపణలు కూడా తెలియజేశాడు. "క్రీడాకారులను హాస్యమాడాలని నేను కోరుకోలేదు. నేను వేసిన జోక్‌కి క్షమాపణలను తెలియజేస్తున్నాను." అని అన్నారు.

టీవి షో పాల్గొన్న నాకు అవేమి పెద్ద నేరంలాగా అనిపించలేదని పేర్కొన్నారు. ఐతే యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ మాత్రం దర్పస్పెచ్ చేసిన వ్యాఖ్యలను చాలా గర్హనీయమైనవిగా పేర్కొంది.

ఈ ఏడాది ప్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ మారియా షరపోవా కూడా దర్పస్పెచ్ చేసిన వ్యాఖ్యలను అమర్యాదకరమైన వ్యాఖ్యలుగా పేర్కొంది. "ఆ వ్యాఖ్యలు బాధ్యతారహిత్యం. ఒలింపిక్ కమీటీలో సభ్యుడిగా క్రీడల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు" అని షరపోవా తెలిపింది.

ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్‌ భాగంగా సింగపూర్‌లో సోమవారం జరుగుతున్న ఫైనల్స్ టైటిల్స్‌లో సెరీనా విలియమ్స్ తొలి రౌండ్‌లో అన్నా ఇవనోవిక్‌తో తలపడనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+