Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంగరంగ వైభవంగా సెరెనా పెళ్లి వేడుక: మిలియన్‌ డాలర్ల ఖర్చు

Serena Williams reportedly marries Alexis Ohanian in New Orleans

హైదరాబాద్: అమెరికా టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌... తన ప్రియుడు, రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఓహనియన్‌ను పెళ్లాడింది. గురువారం అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు అయిన ఖర్చు మిలియన్‌ డాలర్లు పైమాటేనని అంటున్నారు.

గురువారం అమెరికాలోని న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్‌ సెంటర్‌‌లో వైభవంగా జరిగిన పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకలో పాప్‌ సంగీతంతో హోరెత్తించారు. 250 మంది మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు.

2015 నుంచి వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో తాను గర్భవతినని ప్రకటించిన సెరెనా సెప్టెంబరు 1న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాప పేరు అలెక్సిస్‌ ఒలింపియా. ఈ పెళ్లికి వచ్చినవారు ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లలేదు.

ఎందుకంటే సెరెనా తన పెళ్లికి సంబంధించిన హక్కులను స్నేహితురాలు, బ్రిటిష్‌ జర్నలిస్టు అన్నావింటూర్‌కి విక్రయించింది. ఇదిలా ఉంటే సెరెనా పెళ్లికి వోగ్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ అనా విన్‌టూర్‌, హాలీవుడ్‌ స్టార్‌ కిమ్‌ కార్డాషియన్‌, ఇవా లాంగోరియా, పాప్‌ గాయని సియారాలు హాజరయ్యారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 18, 2017, 9:41 [IST]
Other articles published on Nov 18, 2017
Read in English: Serena weds in New Orleans
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+