For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్: సెరీనా ఓటమికి కారణం ఇతడే..!

By Nageswara Rao

అత్యంత అరుదైన 'గ్రాండ్ స్లామ్' కలను యుఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరీనా విలియమ్స్ చేజార్చుకున్న తర్వాత ఆమె అభిమానులు సెరీనా విలిమయ్స్ ప్రియుడు 'డ్రేక్'పై మండిపడుతున్నారు. డ్రేక్ కారణంగానే సెరీనా ఓటమి పాలైందంటూ ట్విట్టర్‌లో ట్వీట్స్ వెల్లువెత్తాయి.

'ఓ డ్రేక్! నువ్వు మ్యాచ్ కి వచ్చి ఎంత పనిచేశావు?' అని ఒకరు ట్వీట్ చేస్తే, మరోకరు 'డ్రేక్! మరో నెల రోజుల పాటు బయట కనిపించావో... ఇక అంతే!' అంటూ ట్వీట్ చేశారు. 'డ్రేక్ ప్రేక్షకుల్లో ఉంటే జరిగే నష్టం మరోసారి తెలిసొచ్చింది' అని మరొకరు వ్యాఖ్యానించారు.

Serena Williams' rapper boyfriend Drake blamed for US Open loss to Roberta Vinci

యూఎస్ ఓపెన్‌లో సెమీస్ వరకూ తిరుగులేని ఆధిపత్యం చూపుతూ వచ్చిన సెరీనాను ఇటలీకి చెందిన అన్ సీడెడ్ ప్లేయర్ రోబెర్ట్ విన్సీ (ఇటలీ) చేతిలో పాలైంది. అమెరికా ఫస్ట్ లేడీ సైతం సెరీనా పోరాట పటిమ అధ్భుతమని మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది.

ఇప్పటికే ఈ కేలండర్ ఇయర్‌లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గిన సెరీనా విలియమ్స్ ఈ యుఎస్ ఓపెన్ కూడా గెలిచి ఉంటే, ఒక కేలండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కేది.

1988లో స్టెఫీ గ్రాఫ్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ స్లామ్‌లను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. తాజాగా ఇప్పుడు సెరీనా విలియమ్స్‌కు ఆ అవకాశం వచ్చింది. యుఎస్ ఓపెన్‌ను నెగ్గినట్లైతే 27 ఏళ్లుగా సాధ్యం కాని ఈ రికార్డుని సెరీనా తన పేరిట నమోదు చేసి ఉండేది.

భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్ లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన విన్సీ 2-6, 6-4, 6-4 స్కోరుతో సెరెనాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో విజయంతో అసలు అంచనాలే లేకుండా దూసుకొచ్చిన విన్సీ నేరుగా ఫైనల్ చేరుకోగా, టైటిల్ ఖాయంగా చేజిక్కించుకుంటుందనుకున్న సెరెనా విలియమ్స్ మాత్రం ఇంటిబాట పట్టింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+