మ్యాగజైన్ కోసం నగ్నంగా సెరెనా: తల్లి కావడంపై ఇలా
హైదరాబాద్: సెరెనా విలియమ్స్... అంతర్జాతీయ టెన్నిస్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 23 గ్లాండ్ స్లామ్‌లను గెలిచింది. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ అథ్లెట్లలో ఒకరిగా గుర్తింపు సాధించింది. విమర్శకులు తన రంగు, ఆట తీరుపై ఎన్నో సార్లు హేళన చేసినా తన ఆటతీరుతో సమాధానమిచ్చింది.
ప్రస్తుతం సెరెనా విలియమ్స్ ఏడు నెలల గర్భవతి. వానిటీ మ్యాగజైన్ ఆగస్టు సంచికకు కోసం సెరెనా విలియమ్స్ నగ్నంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా సెరెనా విలియమ్స్ మీడియాతో మాట్లాడింది. తాను తల్లిని కాబోతున్నానే విషయాన్ని తొందరగా నమ్మలేక పోయాయని చెప్పింది.

ఆరుసార్లు పరీక్షలు చేయించుకున్నా
తన ప్రెగ్నెన్సీని ధ్రువీకరించుకోవడానికి ఆరుసార్లు పరీక్షలు చేయించుకున్నానని చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమెకు జేజేలు పలుకుతున్నారు. ఓ తల్లిగా ఏమి అవసరమో తనకు ఇంకా అర్థం కాలేదని చెప్పింది. అయితే రాబోయే చిన్నారి కోసం తాను ఇంకా సిద్ధం కాలేదని చెప్పింది.

రెడిట్ కో ఫౌండర్ అలెక్సిస్ ఒహానియన్‌తో ఎంగేజ్‌మెంట్
రెడిట్ కో ఫౌండర్ అలెక్సిస్ ఒహానియన్‌తో సెరెనా ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తన 23వ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచే వారం రోజుల ముందు తాను గర్భవతినని తెలిసిందని సెరెనా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

పాజిటివ్‌గా రావడంతో
ప్రెగ్నెన్సీ పరీక్ష చేయించుకున్నప్పుడు పాజిటివ్‌గా రావడంతో ఒక్కసారిగా గుండె జారినంత పనైందని సెరెనా పేర్కొంది. ఆ తర్వాత ఇంట్లో మరో ఐదుసార్లు పరీక్షలు చేయించుకుని వాటిని ఓహానియన్ ముందు ఉంచానని.. అతడు కూడా షాక్‌కు గురయ్యాడని సెరెనా చెప్పింది.

కెరీర్ ఇంకా ముగియలేదు
జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత సెరీనా మళ్లీ టెన్నిస్ టోర్నీలు ఆడలేదు. అయితే తన కెరీర్ ఇంకా ముగియలేదని.. జనవరిలో మళ్లీ బరిలోకి దిగుతానని చెప్పింది.
సెరెనా విలియమ్స్ తల్లి కావడంపై నెటిజన్లు ఇలా
సెరెనా విలియమ్స్ తల్లి కావడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఓ క్వీన్ అని, ఆమె గురించి అసలు డిస్కషన్ అవసరం లేదని హాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ జస్టిన్ ప్రాక్షన్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications