న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి సెరెనా విలియ‌మ్స్ ఔట్‌!!

Serena Williams out of French Open 2020 with Achilles injury

పారిస్‌: మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పారిస్‌లో జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. మ‌డిమ గాయం వ‌ల్ల టోర్నీ నుంచి వైదొలుతుగున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఈ విషయాన్ని రోలాండ్ గారోస్ నిర్వాహకులు కూడా బుధవారం స్పష్టం చేశారు. 39 ఏళ్ల సెరెనా‌.. రెండ‌వ రౌండ్‌లో బ‌ల్గేరియా ప్లేయ‌ర్ స్వెతానా పిరంకోవాతో త‌ల‌ప‌డాల్సి ఉంది. సెరీనా త‌ప్పుకోవ‌డంతో పిరంకోవా మూడ‌వ రౌండ్‌లోకి ప్ర‌వేశించారు.

ఈ నెల ఆరంభంలో యూఎస్ ఓపెన్ సెమీఫైన‌ల్ మ్యాచ్ స‌మ‌యంలో సెరీనా విలియమ్స్ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విక్టోరియా అజరెంకా చేతిలో ఆమె ఓట‌మి ఓడిపోయారు. ఆస‌క్తిక‌రంగా సాగిన ఆ మ్యాచ్‌లో అజ‌రెంకా 1-6, 6-3, 6-3 స్కోర్‌తో సెరీనాపై విజ‌యం న‌మోదు చేశారు. ఆ మ్యాచ్‌లో సెరెనా మ‌డిమ‌కు తీవ్రమైన గాయ‌మైంది. దీంతో రెండు వారాలు రెస్టు తీసుకుని, ఆ త‌ర్వాత మ‌రో ఆరు వారాల పాటు రిహాబిలిటేష‌న్ ఉండి ఫ్రెంచ్ ఓపెన్ ఆడారు. కానీ సెరెనా మధ్యలోనే ఇంటిదారి పట్టారు.

మహిళల సింగిల్స్‌లో జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా), మాజీ వరల్డ్‌ నెంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ)కు తొలిరౌండ్‌లోనే షాక్‌ తగిలింది. డచ్‌ టీనేజర్‌ క్లారా టాసన్‌ 6-4, 3-6, 9-7తో 21వ సీడ్‌ బ్రాడీని ఓడించగా, కాజా జువాన్‌ (స్లోవేనియా) 6-3, 6-3తో కెర్బర్‌కు చెక్‌పెట్టింది. రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా 6-7(9), 6-2, 6-4తో మయర్‌ షరీఫ్‌ (ఈజి్‌ప్ట)పై కష్టపడి నెగ్గగా.. 4వ సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6-4, 3-6, 6-3తో సామ్‌సొనొవాపై,‌ జెలెనా ఓస్టపెంకో (లాత్వియా) 6-2, 6-1తో మాడిసన్‌ బ్రెంగ్లీ (అమెరికా)పై గెలిచి రెండోరౌండ్లో ప్రవేశించారు.

పురుషుల టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సెర్బియా యోధుడు జొకోవిచ్‌ 6-0, 6-2, 6-3తో స్వీడన్‌కు చెందిన 80వ ర్యాంకర్‌ మైకేల్‌ వైమర్‌పై వరుససెట్లలో విజయం సాధించాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం సాగించిన జొకో మ్యాచ్‌లో ఏకంగా 32 విన్నర్లు సంధించాడు.

RR vs KKR: చెలరేగిన ఆర్చర్‌.. ఆదుకున్న గిల్, మోర్గాన్.. రాజస్థాన్‌ లక్ష్యం 175!!

Story first published: Wednesday, September 30, 2020, 22:17 [IST]
Other articles published on Sep 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X