డోపింగ్ పరీక్షకు ముందే ఇంటి నుంచి బయటకు సెరెనా..


హైదరాబాద్: తాజాగా వింబుల్డన్ సీడింగ్ దక్కించుకున్న అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా డోపింగ్ పరీక్షకు అందుబాటులో లేకుండాపోయింది. ఈ పరీక్ష కోసం నమూనాలు సేకరిద్దామని సెరెనా ఇంటికి వెళ్లిన వైద్యధికారులకు నిరాశే ఎదురైంది. ఆమె ఇంట్లో లేకపోవడంతో వారు శాంపిల్స్ తీసుకోకుండానే వెనుదిరిగారు. దీనికి సంబంధించిన కథనం స్థానిక పత్రికలో వెలువడింది. దీనిపై యూఎస్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(యూఎస్‌ఏడీఏ) స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా తాము ఏమీ చేయడంలేదని స్పష్టం చేసింది.
గత ఏడాది బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం సెరెనా ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌తో ఆటలోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వింబుల్డన్‌లో కూడా సెరెనాకు సీడింగ్ దక్కింది. ప్రపంచ 183వ ర్యాంకులో ఉన్న ఆమెకు నిర్వాహకులు 25వ సీడింగ్ ఇచ్చారు.

ఎంతసేపటికీ రాకపోవడంతో.. వెనుదిరిగారు:
ఇదిలా ఉండగా జూన్ 14న ఉదయం 8.30గంటల సమయంలో యూఎస్‌ఏడీఏకు చెందిన వైద్యులు ఫ్లోరిడాలోని సెరెనా విలియమ్స్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సెరెనా ఇంట్లో లేదు. ఆమె వచ్చేంత వరకూ ఉండి నమూనాలు తీసుకొనే వెళ్లాలనుకున్నారు. కానీ, ఆమె ఎంతసేపటికీ రాకపోవడంతో చేసేదేమీ లేక వారు తిరిగి వెళ్లిపోయారు.

బయటకు ఎలా తెలిసింది:
సెరెనా అందుబాటులో లేదని, ఎలాంటి నమూనాలు తీసుకోకుండానే వెనుదిరిగినట్లు ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సీఈవో స్టీవ్ సైమన్ విమానాశ్రయంలో ఎవరితోనే ఫోన్‌లో సంభాషించాడు. ఈ సంభాషణ ఆధారంగా స్థానిక పత్రిక ఓ కథనం ప్రచురించింది. దీంతో విషయం బయటకుపొక్కింది. దీనిపై యూఎస్‌ఏడీఏ అధికార ప్రతినిధి బ్రాడ్ హార్న్ ఇలా స్పందించారు.

ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా:
‘ఆటగాళ్లకు సంబంధించి మేము ఎలాంటి వివరాలు బయటకు చెప్పం. ఎవరో మూడో వ్యక్తి వల్ల ఇదంతా జరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సెరెనాను మూడు సార్లు పరీక్షించాం. అన్నింట్లో ఆమె పాసైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయడం లేదు. ఏడాదిలో మొత్తం ఐదు సార్లు క్రీడాకారులకు పరీక్షలు నిర్వహించాలి. శాంపిల్స్ నమూనాలు సేకరించేందుకు వెళ్లే ముందు వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వం. ఆకస్మాత్తుగా వెళ్లి నమూనాలు సేకరిస్తాం. 12 నెలల కాల వ్యవధిలో మూడు సార్లు ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం'
డోప్ టెస్టు చేసేందుకు సహకరిస్తూనే:
మరోవైపు సెరెనా ప్రతినిధి బుష్ నోవాక్ మాట్లాడుతూ...‘23 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో సెరెనా డోపీగా ఎప్పుడూ తేలలేదు. డోప్ టెస్టు చేసేందుకు ఎప్పుడు అధికారులు వచ్చిన ఆమె వారికి సహకరిస్తూనే ఉంది. ఆమె ఎప్పుడూ నిబంధనలను ఉల్లంఘించలేదు' అని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications