కుక్క ఫుడ్ తిన్న సెరెనా, బాత్‌రూంకు పరుగు పెట్టింది
రోమ్: కుక్క తినాల్సిన ఆహారాన్ని తిని ప్రముఖ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ బాత్ రూంకు పరుగులు పెట్టింది. అయితే, ఆ తర్వాత తెల్లాసరికి మళ్లీ తేరుకొని గేమ్‌కు సిద్దమైంది. అంతేకాదు, మ్యాచ్ కూడా గెలిచింది. ఆమె కుక్క ఆహారం తినడం వల్ల ఆసుపత్రిపాలు కావడం గమనార్హం.
సెరెనా విలియమ్స్ బుధవారం నాడు ఇటాలియన్ ఓపెన్ మ్యాచ్ ఆడటానికి రోమ్ వచ్చింది. ఆమె పెంపుడు శునకం 'చిప్' కోసం హోటల్ నిర్వాహకులు ప్రత్యేక ఆహారం తయారు చేయించి ఇచ్చారు. అది వేటితో తయారు చేశారో మెనూ ఇచ్చారు.

దాంతో ఆ ఆహారం రుచి ఎలా ఉందోనని తెలుసుకోవాలనే కుతూహలం సెరెనా విలియమ్స్‌కు కలిగింది. దీంతో ఆమె ఆ ఆహారాన్ని ఓ చెంచాడు తిన్నది. కొన్ని గంటల తర్వాత కడుపులో తిప్పింది. బాత్ రూంకు పరుగులు పెట్టింది. ఆ తర్వాత రోజుకు కోలుకొని మ్యాచ్ గెలిచింది.
తాను తిన్న ఆహారం గురించి సెరెనా మాట్లాడుతూ... ఆ ఆహారం తనకు ఏమాత్రం నచ్చలేదని, ఇది మనుషులకు పనికి రాదు అని వాళ్లు ఆ మెనూలో రాసి ఉంటే బాగుండేదని చెప్పింది. ఈ ఆహారంతో తాను కొంత ఇబ్బంది పడ్డానని చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications