న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓటమిని కొనసాగిస్తూన్న జకోవిచ్, ఫ్రెంచ్ ఓపెన్‌కు సెరెనా ఔటే..!!

Serena Williams drops out of another tournament

హైదరాబాద్: మాజీ నం.1 నొవాక్‌ జకోవిచ్‌ ఇంకా ఓటమి బాట వీడలేదు. మాడ్రిడ్‌ ఓపెన్‌ తొలి రౌండ్లో కీ నిషికోరి (జపాన్‌)ని ఓడించి ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించిన అతడు రెండో రౌండ్లో చతికిలపడ్డాడు. బ్రిటన్‌ నం.1 కైల్‌ ఎడ్మండ్‌ 6-3, 2-6, 6-3తో ప్రపంచ నం.12 ర్యాంక్‌ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించాడు. నొవాక్‌పై ఎడ్మండ్‌కు ఇదే తొలి విజయం.

మహిళల విభాగంలో వోజ్నియాకి ప్రిక్వార్టర్స్‌లో ఓడింది. కికి బెర్టెన్స్‌ 6-2, 6-2తో ఆమెపై గెలిచింది. ఈ టోర్నీలో విజయం సాధించివుంటే ప్రపంచ నం.2 వోజ్నియాకి అగ్రస్థానానికి చేరుకునేది.

సెరెనా ఔట్‌: అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరం కానుందా? అంటే.. అవుననే అనిపిస్తోంది. మరో నా లుగురోజుల్లో మొదలవనున్న ఇటాలియన్‌ ఓపెన్‌ నుంచి సెరెనా తప్పుకొంది. గతంలో ఇక్కడ నాలుగుసార్లు విజేతగా నిలిచిన సెరెనా షెడ్యూల్‌ ప్రకారం ఈ క్లే కోర్టు ఈవెంట్‌లో ఆడాల్సి ఉంది.

అయితే, ఆమె ఈ టోర్నీలో ఆడడం లేదని నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. దీంతో సెరెనా ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోనూ దిగకపోవచ్చని భావిస్తున్నారు.

Story first published: Thursday, May 10, 2018, 9:49 [IST]
Other articles published on May 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X