Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది చూడలేకపోయినందుకు ఏడ్చేశా: సెరెనా

Serena Williams ‘Cried’ After Missing Her Daughter’s First Steps While Training for Wimbledon

హైదరాబాద్: బలం.. బలహీనత తన కన్న కూతురేనంటోంది అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్. ఎనిమిదో వింబుల్డన్‌ టైటిల్‌పై కన్నేసిన మాజీ నంబర్‌వన్‌ సెరినా విలియమ్స్‌ టోర్నీలో జోరు కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్‌లో క్రిస్టినా(ఫ్రాన్స్‌)పై 7-5, 7-6 (7-2) పోరాడి గెలిచి ఆమె ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఇలా ముచ్చటించింది.

ప్రిక్వార్టర్స్ కోసమని శనివారం తన కూతురితో కలిసి ప్రాక్టీస్‌ సెషన్‌కు వెళ్లింది. కానీ తాను ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఒలంపియా మరోవైపు తొలిసారిగా అడుగులు వేసింది. 'నేను ప్రాక్టీస్‌లో ఉండటంతో.. నా చిట్టితల్లి తొలి అడుగులు చూడలేకపోయాను. అందుకు నేను ఎంతో ఏడ్చానంటూ' సెరెనా ట్విటర్‌లో ఉద్వేగంతో రాసుకొచ్చింది.

ఇది చాలదన్నట్లు.. తన కూతురు ఒలంపియా తొలి అడుగులు వేస్తుండగా చూడలేకపోయినందుకు తీవ్రంగా బాధపడినట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. గత వారం ఒలంపియా ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా ఒలంపియాకు వింబుల్డన్‌ గ్రాస్‌కోర్టును చూపిస్తున్న ఫొటోను పంచుకుంది. ఒలంపియా పుట్టిన నాటి నుంచి తనకు సంబంధించిన కొన్ని విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ విలియమ్స్‌ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

2017 సెప్టెంబర్‌లో ఒలంపియాకు జన్మనిచ్చిన ఆమె.. 16నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి 2018 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అడుగుపెట్టింది. రష్యా భామ మరియా షరపోవాతో ప్రిక్వార్టర్స్‌ పోరుకు కొన్ని నిమిషాల ముందు గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పింది. మళ్లీ తాజాగా వింబుల్డన్‌లో టెన్నిస్‌ బ్యాట్‌ పట్టి జోరు కొనసాగిస్తోంది.

Story first published: Sunday, July 8, 2018, 11:50 [IST]
Other articles published on Jul 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+