Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెరీనా ఫొనే కొట్టేస్తాడా!: ఛేజ్ చేసి మరీ పట్టుకుంది

న్యూయార్క్: దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఓ దొంగ ఆట కట్టించిన తీరు ఆకట్టుకుంటోంది. తన ఫోన్ దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ప్రబుద్ధుడిని ఛేజ్ చేసి మరీ పట్టుకుంది.

ఇప్పటికే 21 టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్న బ్లాక్ థండర్ సెరెనానే ఈ ఆసక్తికర ఘటనను స్వయంగా సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేసింది. సోదరి వీనస్ విలియమ్స్ , మరో టెన్నిస్ తార కరోలినా వాజ్నియాకితో కలిసి సెరెనా ఓ చైనీస్ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

Serena Williams chases man after phone 'grabbed' in restaurant

కుర్చీలో ఉంచిన ఆమె మొబైల్‌ను కొట్టేసిన ఆ చోరడు అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన సెరినా వెంటనే అప్రమత్తం అయింది. కేకలు వేసినా ఎవరూ స్పందించకపోవడంతో ఆమె వెంటపడింది. వాడు అంత కంటే వేగంగా కదిలాడు.

అంతే ఆమె కూడా మెరుపు వేగంతో కదిలింది. వాడిని ఛేజ్ చేసి పట్టుకుంది. దొంగిలించిన తన మొబైల్‌ను వెనక్కి తీసుకుంది. అయితే అతను పొరపాటున ఆమె మొబైల్ తీసుకున్నానని చెప్పడంతో అతడ్ని మాటలతో సరిపట్టి వదిలేసింది సెరీనా. ఈ చర్యతో ఈ అమెరికన్ టెన్నిస్ స్టార్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+