Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మార్గరెట్‌ గ్లాండ్ స్లామ్ రికార్డుని సెరెనా బద్దలు కొడుతుంది'

హైదరాబాద్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌‌పై టెన్నిస్ లెజెండ్ స్టెఫీ గ్రాఫ్ ప్రశంసల వర్షం కురిపించింది. టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచే సత్తా సెరెనా విలియమ్స్‌కు ఉందని స్టెఫీ గ్రాఫ్ చెప్పింది. ప్రస్తుతం ఓపెన్‌ ఎరాలో 23 టైటిళ్లతో సెరెనా విలియమ్స్ అగ్రస్థానంలో ఉంది.

అయితే మొత్తం మీద 24 టైటిళ్లతో మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్గరెట్‌ అగ్రస్ధానంలో ఉంది. పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చిన తర్వాత సెరెనా విలియమ్స్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పునరాగమనం చేసే అవకాశం ఉంది. డబ్ల్యూటీఏ ఎలైట్‌ ట్రోఫీకి స్టెఫీగ్రాఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

Serena Williams Can 'Absolutely' Break Court's Grand Slam Record: Steffi Graf

ఈ నేపథ్యంలో నేపథ్యంలో స్టెఫీ గ్రాఫ్ మాట్లాడింది. 'పునరాగమనం చేస్తే అత్యధిక టైటిళ్ల రికార్డును సెరెనా కచ్చితంగా తిరగరాస్తుంది. ఒకవేళ మార్గరెట్‌ రికార్డుపై ఆమె కన్నేసి ఉంటే, కచ్చితంగా సాధించకుండా మాత్రం కెరీర్‌కు వీడ్కోలు పలకదు' అని స్టెఫీ గ్రాఫ్ చెప్పడం విశేషం.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు సెరెనా వచ్చే జనవరిలో జరిగే ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ఆడాలని ఆశిస్తున్నారు. ఈ ఏడాది రెండు వారాల గర్భంతో ఆస్ట్రేలియన్‌ బరిలోకి దిగిన ఆమె టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+