న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్నీంటి పర్యంతమైన సెరెనా విలియమ్స్‌.. ఎందుకో తెలుసా?

Serena Williams breaks down in tears as back spasms force to retire in middle of finals

టొరొంటో: మహిళా టెన్నిస్ స్టార్, అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ మైదానంలోనే ఒక్కసారిగా ఏడ్చేసింది. వెన్ను నొప్పి కారణంగా రోజర్స్‌ కప్‌ ఫైనల్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న సెరెనా విలియమ్స్‌ టెన్నిస్‌ కోర్టులోనే కన్నీంటి పర్యంతమైంది. సెరెనా అర్ధంతరంగా తప్పుకోవడంతో టొరంటోలో ఆదివారం జరిగిన ఫైనల్లో బియాంక ఆండ్రీస్కు (కెనడా) విజేతగా నిలిచింది.

<strong>సిద్ధార్థ్‌ దేశాయ్‌ విఫలం.. బంగాల్‌తో టైటాన్స్‌ మ్యాచ్‌ టై</strong>సిద్ధార్థ్‌ దేశాయ్‌ విఫలం.. బంగాల్‌తో టైటాన్స్‌ మ్యాచ్‌ టై

వెన్ను నొప్పి ఎక్కువవడంతో:

రోజర్స్‌ కప్‌ ఫైనల్‌లో 19 ఏళ్ల కెనడియన్ ఆండ్రీస్కుతో సెరెనా తలపడింది. సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన బియాంక 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే సమయంలో వెన్ను నొప్పి ఎక్కువవడంతో సెరెనా మెడికల్ టైమ్‌ అవుట్ కోరింది. ఫిజియోతో మాట్లాడిన సెరెనా.. మ్యాచ్‌ నుంచి తప్పుకుంది. అనంతరం అంపైర్ ఆండ్రీస్కును విజేతగా ప్రకటించాడు. దీంతో 50 సంవత్సరాలలో రోజర్స్ కప్ గెలిచిన మొదటి కెనడియన్‌గా బియాంకా ఆండ్రెస్కు నిలిచింది.

సెరెనాను ఓదార్చిన బియాంక:

'నన్ను క్షమించండి. నొప్పి మరింత ఎక్కువైంది. మ్యాచ్ నేను ఆడలేకపోతున్నా. ఎంత ప్రయత్నించినా.. నా వల్ల కావడం లేదు. నేను మ్యాచ్‌ను కొనసాగించలేను' అంటూ సెరెనా కన్నీటి పర్యంతమైంది. విజేతగా నిలిచిన బియాంక.. సెరెనా దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంది. కోర్టులోనే ఏడుస్తున్న సెరెనాను బియాంక ఓదార్చింది. అనంతరం కప్ అందుకుని సంబరాల్లో మునిగితేలింది.

చాంపియన్‌ నాదల్‌:

చాంపియన్‌ నాదల్‌:

రోజర్స్‌ కప్‌ పురుషుల సింగిల్స్‌లో రష్యా క్రీడాకారుడు డానిల్‌ మెద్వెదెవ్‌ను ఓడించి స్పెయిన్ బుల్, డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్ నాదల్‌ టైటిల్‌ అందుకున్నాడు. నాదల్‌ 6-3, 6-0తో మెద్వెదెవ్‌ను వరుస సెట్లలో ఓడించి వరుసగా రెండో ఏడాది ట్రోఫీ అందుకున్నాడు.

క్లే కోర్టు కింగ్‌ అయిన నాదల్‌ హార్డ్‌ కోర్టులో టైటిల్‌ నిలబెట్టుకోవడం విశేషం. నాదల్‌కిది కెరీర్‌లో 35వ మాస్టర్స్‌ టైటిల్‌. రోమ్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ తర్వాత ఈ సీజన్‌లో నాదల్‌కిది మూడో టైటిల్‌.

Story first published: Tuesday, August 13, 2019, 9:56 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X