ఆస్ట్రేలియన్ ఓపెన్: చరిత్ర సృష్టించిన సెరీనా, రాకెట్ విరగొట్టింది
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో వీనస్ విలియమ్స్‌పై 6-4, 6-4 తేడాతో సెరీనా విలియమ్స్ విజయం సాధించింది. ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ ఓపెన్ చరిత్రలో సెరీనా ఓ సరికొత్త రికార్డుని సృష్టించింది.
23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా సెరీనా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఓపెన్ చరిత్రలో జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ సాధించిన అత్యధిక 22 టైటిళ్లు రికార్డును అధిగమించింది. తేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన సెరెనా.. యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లో నిష్క్రమించి ఆ రికార్డును మిస్సయ్యింది.

సరికొత్త రికార్డుని నెలకొల్పిన సెరీనా
అయితే తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇక, మహిళల సింగిల్స్ చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయర్ మార్గరేట్ కోర్ట్ 24 టైటిళ్లు గెలిచి మొట్టమొదటి స్ధానంలో ఉంది. కానీ ఆమె అమెచ్యూర్, ప్రొఫెషనల్ రెండింటిలో కలిపి ఆ రికార్డును నమోదు చేసింది.

తొలి సెట్ ఆసక్తికరం
శుక్రవారం జరిగిన ఫైనల్‌లో సెరీనా విలియమ్స్ అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించింది. అక్కాచెల్లెల్ల మధ్య తొలి సెట్ ఆసక్తికరంగా మొదలైంది. ఇద్దరూ తొలి రెండు గేమ్స్‌ను బ్రేక్ చేశారు. అయితే తమ మూడవ గేమ్ సర్వీసులను మాత్రం ఇద్దరూ నిలుపుకోవడం విశేషం.

రాకెట్‌ను విరగొట్టిన సెరీనా
ఇక రెండో గేమ్‌లో సెరీనా కాస్తంత తగ్గినట్లు కనిపించింది. ఒకానొక దశలో గ్రౌండ్‌లో జారిపడటంతో కోపంలో తన చేతిలోనే రాకెట్‌ను విరగొట్టింది. తొలి సెట్‌లో తొలి నాలుగు గేమ్‌లు డ్యూస్ వరకు వెళ్లాయి. బ్యాక్ హ్యాండ్ స్ట్రోక్స్‌తో ఇద్దరూ చెలరేగి ఆడారు. సెరీనా పవర్ గేమ్ ఆడగా, వీనస్ మాత్రం రిటర్న్ షాట్లతో అద్భుత ప్రదర్శన చేసింది.

చివరకు 41 నిమిషాలు ఎంతో కీలకం
తొలి సెట్‌లో నాల్గవ గేమ్‌ను బ్రేక్ చేసిన సెరీనా ఆ తర్వాత తన సర్వీసును నిలుపుకుని చెల్లి సెరీనా 5-3 ఆధిపత్యాన్ని సాధించింది. చివరకు 41 నిమిషాల్లో తొలి సెట్‌ను సెరీనా 6-4 స్కోరుతో గెలుచుకుంది. ఇక రెండవ సెట్‌ను వీనస్ విలియమ్స్ అద్భుతంగా స్టార్ట్ చేసి తొలి సర్వ్‌ను నిలుపుకుంది. సెరీనా కూడా రెండవ సెట్ తొలి సర్వ్‌ను నిలుపుకుంది.

రెండో గేమ్ కోసం తీవ్రంగా శ్రమించిన వీనస్
ఆ తర్వాత రెండో గేమ్ కోసం వీనస్ కొంత శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ 2-2కు చేరుకున్నారు. మూడో సర్వీస్‌ను కూడా నిలుపుకోవడంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. వీనస్ చేసిన నాలుగవ సర్వ్‌ను బ్రేక్ చేసిన సెరీనా 4-3 ఆధిక్యాన్ని సాధించింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా సెరీనా
ఈ క్రమంలో సెరీనా కొట్టిన బలమైన సర్వీసులకు వీనస్ విలియమ్స్ చేతులెత్తేసింది. సెరీనా పవర్ సర్వీసులకు ఆ స్ధాయిలో రిటర్న్ ఇవ్వలేకపోయింది. క్రాస్ కోర్టు షాట్లతో వీనస్ విలియమ్స్ దీటుగా ఆడినా ఫలితం లేకపోయింది.కేవలం 41 నిమిషాల్లోనే రెండవ సెట్‌ను కూడా 6-4 స్కోరుతో సెరీనా సొంతం చేసుకుని ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications