న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళా సాకర్‌ జట్టును కొనుగోలు చేసిన సెరెనా విలియమ్స్!!

Serena Williams and Daughter Alexis Olympia Are Now Co-owners of an Los Angeles soccer team

వాషింగ్టన్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సాకర్‌ జట్టుకు యజమానురాలుగా మారారు. నటి నటాలీ పోర్ట్మన్‌తో కలిసి అమెరికాలోని జాతీయ మహిళల సాకర్ జట్టును సెరెనా కొనుగోలు చేశారు. సెరెనా ముద్దుల కుమార్తె అలెక్సిస్ ఒలింపియా ఓహానియన్, అలెక్సిస్ ఓహానియన్ కూడా జట్టుకు సహయజమానులుగా ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ ఉమెన్స్ సాకర్ లీగ్ ఓ ప్రకటనలో తెలిపింది.

23 సార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన సెరెనా విలియమ్స్..‌ సాకర్‌ జట్టుకు పేరు ఇంకా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతానికి దీనిని 'ఏంజెల్ సిటీ' అని పిలుస్తున్నారు. 2022 సీజన్ కోసం లాస్ ఏంజిల్స్‌లో విస్తరణ బృందాన్ని కలిగి ఉంటుందని నేషనల్ ఉమెన్స్ సాకర్ లీగ్ ప్రకటించింది. ఆస్కార్ విజేత నటి పోర్ట్మన్, టెక్నాలజీ వెంచర్ క్యాపిటలిస్ట్ కారా నార్ట్మన్, గేమింగ్ వ్యవస్థాపకుడు జూలీ ఉహర్మాన్ మరియు విలియమ్స్ భర్త అలెక్సిస్ ఓహానియన్ జట్టును లీడ్ చేయనున్నారు.

'లాస్ ఏంజిల్స్‌ మహిళల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్‌ను తీసుకురావడానికి కృషి చేస్తున్న ఈ అద్భుతమైన సమూహంలో భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. నా రెండేండ్ల కుమార్తెతో ఫుట్‌బాల్ చుట్టూ గంటల కొద్ది తన్నుతూ ఉన్నాను. ఈ విప్లవానికి ఆమె ముందు వరుసలో ఉండాలని నేను కోరుకుంటున్నాను' అని విలియమ్స్ భర్త మరియు రెడ్డిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఓహానియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అమెరికా నల్ల కలువ సెరీనా విలియ‌మ్స్‌కు భారీ షాక్ తలిగింది. గతంలో ఏడు సార్లు చాంపియ‌న్‌గా నిలిచిన సెరీనాను మూడ‌వ రౌండ్‌లో చైనాకు చెందిన వాంగ్ కియాంగ్ ఓడించారు. రసవత్తర పోరులో వాంగ్ కియాంగ్ 6-4, 6-7, 7-5 తేడాతో సెరెనాపై నెగ్గింది. అంతకుముందు యుఎస్ ఓపెన్ ఫైనల్లో కూడా ఓడిపోయారు. ఫలితంగా అత్య‌ధికంగా సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ను గెలుచుకున్న‌ మార్గ‌రెట్ కోర్టు రికార్డును స‌మం చేసేందుకు సెరీనా విలియమ్స్ మరో గ్రాండ్ స్లామ్ టోర్నీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచకప్‌ లాంటిదే ఐపీఎల్.. లీగ్‌లో ఆడటాన్ని బాగా ఆస్వాదిస్తా: ఆసీస్ స్టార్ ప్లేయర్ప్రపంచకప్‌ లాంటిదే ఐపీఎల్.. లీగ్‌లో ఆడటాన్ని బాగా ఆస్వాదిస్తా: ఆసీస్ స్టార్ ప్లేయర్

Story first published: Wednesday, July 22, 2020, 18:51 [IST]
Other articles published on Jul 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X