యుఎస్ ఓపెన్ ఫైనల్లో ‘సెక్సిజం’: అంఫైర్‌ని దొంగ అన్న సెరెనా విలియమ్స్

హైదరాబాద్: "నేను చీట్ చేయను... చీట్ చేసి గెలవాల్సిన అవసరం నాకు లేదు" యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఓటమి అనంతరం అమెరికాకు చెందిన టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ చేసిన వ్యాఖ్యలివి. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎవరూ ఊహించని విధంగా జపాన్‌కు చెందిన నవోమీ ఒసాకా టైటిల్ విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే.
ఆరు సార్లు యుఎస్ ఓపెన్ గెలిచిన సెరెనా విలియమ్స్ ఫైనల్లో వరుస సెట్లలో 6-2, 6-4 తేడాతో ఒసాకా చేతిలో ఓటమిపాలైంది. రెండో సెట్‌లో సెరెనా నిబంధనలు ఉల్లంఘించి ఛైర్ అంపైర్ ఆగ్రహానికి గురైంది. తొలి సెట్‌ను 6-2 కోల్పోయిన సెరెనా.. రెండో సెట్ జరుగుతున్న సమయంలో కోచ్ సాయం తీసుకోవడంపై ఛైర్ అంపైర్ హెచ్చరించాడు.

ఛైర్ అంపైర్ కార్లోస్‌ను దొంగ అని సంబోధించిన సెరెనా
దీంతో వాగ్వాదానికి దిగిన సెరెనా ఛైర్ అంపైర్ కార్లోస్‌ను దొంగ అంటూ సంబోధిస్తూ ఆగ్రహంతో రాకెట్‌ను నేలకేసి కొట్టింది. ఆట నిబంధనలు ఉల్లంఘించడంతో ఛైర్ అంపైర్ ఆమెకు ఒక పాయింట్ జరిమానా విధించాడు. తర్వాత మ్యాచ్ రెఫరీని పిలిచి ఛైర్‌అంపైర్‌పై ఫిర్యాదు చేసి అతను క్షమాపణ చేప్పాలని సెరెనా డిమాండ్ చేసింది. సెరెనా విలియమ్స్ ‘సెక్సిజం' ఆరోపణల వెనక కారణమేమిటంటే... నవోమీ ఒసాకా చేతిలో 6-2 తేడాతో తొలి సెట్ ఓడిన తర్వాత తీవ్ర ఒత్తిడికి గురవ్వడమేనని టెన్నిస్ విశ్లేషకులు అంటున్నారు.

కోచ్ ఎలాంటి సాయం చేయలేదన్న సెరెనా
దీనిపై సెరెనా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన కోచ్ పాట్రిక్ మౌరటోగ్లో రెండో సెట్ సమయంలో తనకు ఎలాంటి సాయం చేయలేదని అన్నారు. అంతేకాదు "నేను చీట్ చేయను... చీట్ చేసి గెలవాల్సిన అవసరం నాకు లేదు. అలా గెలవాల్సి వస్తే ఓడిపోవడానికి ప్రాధాన్యం ఇస్తా... నువ్వు నా క్యారెక్టర్‌ను నిందిస్తున్నావు. నువ్వు అబద్దాల కోరువి. దొంగవీ... ఇకపై నేను ఆడబోయే ఏ మ్యాచ్‌లోనూ నిన్ను ఉండకుండా చేస్తా" అని సెరెనా విలియమ్స్ విరుచుకుపడింది.

తాను మహిళను కాబట్టే అంపైర్లు ఇలా వ్యవహరిస్తున్నారు
తాను మహిళను కాబట్టే అంపైర్లు తనపై ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, పురుషుల సింగిల్స్ మ్యాచుల్లో ఇలాంటి నిబంధనలు ఎందుకు గుర్తుకురావంటూ నిలదీసింది సెరీనా. ‘సెక్సిజం' కారణంగానే మహిళలను చిన్న చూపు చూస్తున్నారంటూ వాపోయింది. క్రీడల్లో పురుష ఆటగాళ్లతో పోల్చితే.. మహిళలపై వివక్ష ఉంటుందన్న తన నమ్మకాన్ని ఈ ఘటన బలోపేతం చేసిందని సెరెనా వ్యాఖ్యానించింది.

ఛైర్ అంపైర్లు ఎలా ప్రవర్తిస్తారో చూశాను
"పురుష ఆటగాళ్ల పట్ల ఛైర్ అంపైర్లు ఎలా ప్రవర్తిస్తారో నేను చూశాను. ఇక్కడ నేను మహిళల హక్కుల కోసం, వారి సమానత్వం కోసం పోరాడుతున్నాను" అని సెరెనా తెలిపింది. మహిళలు ఎలా వివక్షకు గురువుతున్నారో వివరిస్తూ.. గతవారం ఫ్రెంచ్ క్రీడాకారిణి అలిజ్ కార్నెట్ ఎండ వేడిమి కారణంగా కోర్టులోనే షర్ట్ విప్పేసిన ఘటనలో ఆమెను ఛైర్ అంపైర్ హెచ్చరించిన ఘటనను ఈ సందర్భంగా వివరించింది.

అంపైర్ తిట్టిన నేరం కింద సెరెనాకు ఒక పాయింట్ పెనాల్టీ
కాగా, అంపైర్ తిట్టిన నేరం కింద పెనాల్టీ విధిస్తూ ఓ పాయింట్ నయోమీ ఒసాకాకి వెళ్లింది. ఈ పాయింట్ వల్ల 5-3 నయోమీ ఒసాకా ఆధిక్యం పెరిగి, విజయానికి ఒక్క పాయింట్ దూరంలో నిలిచింది. ఆ తర్వాత ఆ ఒక్క పాయింట్‌ను నవోమీ గెలవడంతో సెరెనా విలియమ్స్ కంటతడి పెడుతూ సూపర్‌వైజర్‌తో మాట్లాడడం కనిపించింది. ఆ తర్వాత సెట్ పాయింట్ సాధించిన నవోమీ, సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది.
అంపైర్‌తో గొడవపడిన ప్రతీ మ్యాచ్‌లోనూ సెరెనా ఓటమి
గతంలో 2009 యుఎస్ సెమీ ఫైనల్‌లో, 2011 ఫైనల్లో కూడా ఇలాగే లైన్ అంపైర్లతో సెరెనా గొడవ పడింది. అయితే ఆమె అంపైర్‌తో గొడవపడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఓటమి పాలవడం విశేషం. మరోవైపు 2106 యుఎస్ ఓపెన్‌లో ఇప్పుడు ఛైర్‌లో ఉన్న అంఫైర్ కార్లోస్‌తో సెరెనా అక్క వీనస్ విలియమ్స్ కూడా గొడవపడటం విశేషం. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో అంఫైర్‌తో సెరెనా గొడవకు కారణమైన ఆమె కోచ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. రెండో సెట్‌లో తాను సెరెనాకు సాయం చేశానని ఒప్పుకొన్నారు. చేతుల ద్వారా కొన్ని సంజ్ఞలు చేసినట్లు సెరెనా కోచ్ మ్యాచ్ అనంతరం అంగీకరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications