సెరెనా పెళ్లికి ఏర్పాట్లు పూర్తి: హాజరు కానున్న 250మంది అతిథులు

హైదరాబాద్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పెళ్లికూతురు కానుంది. గురువారం సెరెనా.. తన ప్రియుడు, రెడిట్ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్ ఓహనియన్‌ను పెళ్లాడనుంది. ఈ పెళ్లికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరుకాన్నారు. వీరి పెళ్లికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
2015 నుంచి వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో తాను గర్భవతినని ప్రకటించిన సెరెనా సెప్టెంబరు 1న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి ఒక మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. భారత కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ.6కోట్లు.
వీరి పెళ్లికి న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్ సెంటర్ వేదిక అయింది. 250 మంది మాత్రమే వీరి పెళ్లికి హాజరుకానున్నారు. ఈ పెళ్లికి వచ్చేవారు సెల్‌ఫోన్లు తీసుకురాకూదనే కండిషన్ పెట్టారు. ఎందుకంటే సెరెనా తన పెళ్లికి సంబంధించిన హక్కులను స్నేహితురాలు, బ్రిటిష్ జర్నలిస్టు అన్నావింటూర్‌కి విక్రయించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications