For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కాచెల్లెళ్ల పోరు: యుఎస్ ఓపెన్‌లో 30వ సారి వీనస్ Vs సెరెనా

By Nageshwara Rao
Serena and Venus Williams will face off in the third round of the US Open

హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్ వేదికగా యుఎస్ ఓపెన్‌ గ్రాండ్ స్లామ్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. టోర్నీలో భాగంగా అక్కా చెల్లెళ్లు సెరెనా విలియమ్స్‌, వీనస్‌ విలియమ్స్‌ల పోరుకు రంగ సిద్దమైంది. మూడో రౌండ్‌లోవీరిద్దరూ తలపడబోతున్నారు.

యుఎస్ ఓపెన్‌లో వీరిద్దరూ తలపడటం ఇది 30వ సారి కావడం విశేషం. రికార్డు స్థాయిలో 24వ సింగిల్స్‌ గ్రాండ్‌ స్లామ్‌ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న సెరెనా విలియమ్స్‌ రెండో రౌండ్లో 6-2, 6-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి కరినా వితాఫ్ట్‌పై విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది.

మరోవైపు ఇటలీ క్రీడాకారిణి కమిలా జియార్జిపై 6-4, 7-5తో విజయం సాధించి వీనస్‌‌ విలియమ్స్ కూడా మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. దీంతో వీరిద్దరూ ప్రత్యర్థులుగా మూడో రౌండ్‌లో తలపడనున్నారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడటం ఇది 30వ సారి. ఇప్పటి వరకు వీరిద్దరూ 29 సార్లు ప్రత్యర్థులుగా తలపడగా సెరెనా 17 సార్లు, వీనస్‌ 12 సార్లు విజయం సాధించింది.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం వీరిద్దరి మధ్య మ్యాచ్‌ జరగనుంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 30 గ్రాండ్‌ స్లామ్‌ టైటల్స్‌ను సాధించారు. అందులో సెరెనా 23 గ్రాండ్‌ స్లామ్‌ టైటల్స్‌ సాధించగా, వీనస్‌ ఏడు గ్రాండ్‌ స్లామ్‌ టైటల్స్‌ను దక్కించుకుంది.

ఇక, పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ రఫెల్‌ నాదల్‌ మూడో రౌండ్‌లోకి ప‍్రవేశించాడు. రెండో రౌండ్‌లో 6-3, 6-4, 6-2 తేడాతో కెనాడా ప్లేయర్‌ వాసెక్‌ పాస్పిసిల్‌పై వరుస సెట్లలో విజయం సాధించి మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు.

Story first published: Thursday, August 30, 2018, 15:26 [IST]
Other articles published on Aug 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+