హైదరాబాద్: యుఎస్ ఓపెన ద్వారా కెరీర్లో రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోన్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఈసారి గట్టి పోటీ ఎదురుకాబోతోంది. యుఎస్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ మూడో రౌండ్లోనే తలపడే అవకాశముంది.
అంతేకాదా సెరెనా విలియన్స్ యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి చేరుకోవాలంటే ప్రస్తుతం నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోన్న సిమోన హలెప్‌ను కూడా ఓడించాల్సి ఉంది. డ్రా ప్రకారం సెరెనా, వీనస్‌లు తొలి రెండు రౌండ్లలో విజయాలు సాధిస్తే.. తర్వాతి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్ విజేత నాలుగో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్‌తో తలపడనుంది. యుఎస్ ఓపెన్‌ను ఆరు సార్లు నెగ్గిన సెరెనా విలియమ్స్‌కు ఈసారి టోర్నీలో సెరెనాకు 17వ సీడింగ్ దక్కింది. తొలి రౌండ్లో సెరెనా విలియమ్స్ మాగ్దా లినెట్టీతో తలపడనుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్, జకోవిచ్ ప్రిక్వార్టర్స్ దాటితే.. క్వార్టర్స్‌లో ప్రత్యర్థులుగా మారనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుండగా.. ఫెదరర్‌కు రెండో సీడింగ్ దక్కింది. వింబుల్డన్ ఛాంపియన్ జకోవిచ్ ఆరో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు.