Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్: పాత సెరెనాను గుర్తుకు తెస్తూ మూడో రౌండ్‌లోకి

Serena coasts, difficulties for Halep and Muguruzas marathon

హైదరాబాద్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, టాప్‌సీడ్ సిమోన్ హలెప్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడోరౌండ్‌కు దూసుకెళ్లారు. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా తార సెరెనా విలియమ్స్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అదరగొడుతోంది.

గురువారం రెండో రౌండ్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆమె 6-2, 6-2తో కెనడా అమ్మాయి బౌచర్డ్‌ను చిత్తుగా ఓడించింది. యూఎస్ ఓపెన్ ఫైనల్లో అనూహ్యంగా ఒసాకా చేతిలో కంగుతిన్న సెరెనా.. మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తాజాగా బరిలోకి దిగింది. అప్పట్లో చైర్ అంపైర్‌పై సెరెనా నోరు చేసుకున్న విషయం తెలిసిందే.

పాత సెరెనాను గుర్తుకు తెస్తూ

పాత సెరెనాను గుర్తుకు తెస్తూ

ఆటలో పాత సెరెనాను గుర్తుకు తెస్తూ సెరెనా విలియమ్స్ రికార్డు విజయం దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఇక, ఈ ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రుమేనియా స్టార్ హలెప్ రెండోరౌండ్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంది. అమెరికా టెన్నిస్ భామ సోఫియా కెనిన్‌తో జరిగిన రెండోరౌండ్ పోరులో హలెప్ 6-3,6-7 (5/7), 6-4 స్కోరుతో కష్టపడి గెలిచింది.

జిదాన్‌సెక్‌పై నెగ్గిన ఒసాకా

జిదాన్‌సెక్‌పై నెగ్గిన ఒసాకా

జపాన్‌కు చెందిన ఒసాకా 6-2, 6-4తో జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)ను ఓడించింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్‌ స్వితోలినా 6-4, 6-1తో కుజ్‌మోవా (స్లొవేకియా)పై, ఏడో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌) 4-6, 6-1, 6-0తో బ్రింగిల్‌ (అమెరికా)పై, వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 6-3, 4-6, 6-0తో కోర్నెట్‌ (ఫ్రాన్స్‌)పై, మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6-3, 6-4తో పొటాపోవా (రష్యా)పై, వాంగ్‌ (చైనా) 6-2, 6-3తో కుర్నిచ్‌ (సెర్బియా)పై, బసిన్‌స్కీ (స్విట్జర్లాండ్‌) 6-2, 7-5తో విక్లియాన్‌త్సెవా (రష్యా)పై విజయం సాధించారు.

మూడోరౌండ్ చేరుకున్న నొవాక్ జొకోవిచ్

మూడోరౌండ్ చేరుకున్న నొవాక్ జొకోవిచ్

పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్, క్రొయేషియా స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడోరౌండ్ చేరుకున్నాడు. ఏడో ఆస్ట్రేలియన్ ఓపెన్‌పై గురిపెట్టిన జొకో..6-3,7-5,6-4 స్కోరుతో ఫ్రాన్స్ వెటరన్ జో విల్‌ఫ్రెడ్ సోంగాపై వరుససెట్లలో సునాయాసంగా విజయం సాధించాడు. మూడోసీడ్ ఫెదరర్, రెండోసీడ్ నాదల్ కూడా మూడోరౌండ్ చేరడంతో ఈ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ త్రయం పోరు ప్రేక్షకులకు కనులవిందు కానుంది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వావ్రింకా ఔట్

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వావ్రింకా ఔట్

కాగా, మాజీ ఛాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన రెండో రౌండ్లో అతడు 7-6 (7-4), 6-7 (6-8), 6-7 (11-13), 6-7 (5-7)తో రోనిచ్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో ఏడోసీడ్ డొమినిక్ థీమ్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వైల్డ్‌కార్డ్ ద్వారా మెయిన్‌డ్రాకు చేరిన ఆస్ట్రేలియన్ అలెక్సీ పొపీరిన్ 7-5,6-4,2-0తో ఆధిక్యంలో ఉన్న దశలో థీమ్ తప్పుకోవడంతో విజయంతో మూడోరౌండ్ చేరుకున్నాడు.

మూడో రౌండ్‌కు కీ నిషికోరి

మూడో రౌండ్‌కు కీ నిషికోరి

వైల్డ్‌కార్డ్‌ ఆటగాడు పొపిరిన్‌ (ఆస్ట్రేలియా)తో మ్యాచ్‌లో 5-7, 4-6, 9-2తో వెనుకబడి ఉన్న దశలో అతడు రిటైరయ్యాడు. జపాన్ నంబర్‌వన్ ఆటగాడు కీ నిషికోరి 6-3,7-6((6-8),5-7,5-7,7-6(10-7)స్కోరుతో హోరాహోరీగా పోరాడి కార్లోవిచ్‌ను ఓడించి ముందంజ వేశాడు. హెర్బర్ట్‌ (ఫ్రాన్స్‌), ఫోగ్నిని (ఇటలీ), కోరిచ్‌ (క్రొయేషియా), గొఫిన్‌ (బెల్జియం) మూడో రౌండ్‌కు చేరుకున్నారు.

Story first published: Friday, January 18, 2019, 10:12 [IST]
Other articles published on Jan 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+