టెన్నిస్ స్టార్ జొకోవిక్‌కు కరోనా పాజిటివ్.. మంచి పని కోసమని వెళితే...!

ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. అన్నీ జాగ్రత్తలు తీసుకునే వీఐపీలను సైతం ఈ మాయదారి మహమ్మారి అమాంతం అటాక్ చేస్తోంది. ఇప్పటి వరకు క్రికెటర్లపై విరుచుకుపడ్డ కరోనావైరస్ ఇప్పుడు టెన్నిస్ క్రీడాకారులపై పంజా విసురుతోంది. తాజాగా సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవక్ జొకోవిచ్ కరోనా బారినపడ్డాడు. సెర్బియా క్రొయేషియాల్లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో జకోవిచ్ పాల్గొన్నాడు.

జొకోవిచ్‌కు కరోనా
ముందుగా బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడిన జొకోవిచ్ అనంతరం క్రొయేషియాలోని జదార్‌లో గతవారాంతం జరిగిన టెన్నిస్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడాడు. ఇదిలా ఉంటే జొకోవిచ్ భార్యకు కూడా కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. మ్యాచ్‌లు ముగించుకుని బెల్‌గ్రేడ్‌కు రాగానే తమ కుటుంబం కరోనా వైరస్ టెస్టులు చేయించుకుందని అయితే తనకు తన భార్య జెలీనాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా తమ పిల్లలకు నెగిటివ్‌గా తేలిందని ఒక ప్రకటనలో జొకోవిచ్ తెలిపాడు. కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇతర దేశాల నుంచి క్రీడాకారులను తీసుకొచ్చి మ్యాచ్‌లు నిర్వహించడంపై జొకోవిచ్‌పై చాలా విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉంటే విక్టర్ ట్రాయ్కీకి కరోనా పాజిటివ్‌గా తేలిన మూడో ఆటగాడిగా గుర్తింపుపొందగా జొకోవిచ్ నాలుగో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే విక్టర్ ట్రాయ్కీతో పాటు గర్భవతి అయిన తన భార్య కూడా పాజిటివ్ వచ్చినట్లు తను పేర్కొన్నాడు. రెండు విడతలుగా జరిగిన ఈ పర్యటనల్లో విక్టర్ బెల్‌గ్రేడ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే ఆ మ్యాచ్ జరిగిన సమయంలో భౌతిక దూరం నిబంధన అమలు కాలేదని సమాచారం.

మంచి పనికోసం టోర్నమెంట్
ఇదిలా ఉంటే గత నెలలో తాము తలపెట్టిన కార్యక్రమం ఒక మంచి పనికోసం పవిత్ర హృదయంతో చేశామని జొకోవిచ్ చెప్పాడు. కరోనాతో చాలా మంది బాధపడుతున్న సమయంలో ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా వారందరికి సంఘీభావం చాటాలని అనుకున్నట్లు జొకోవిచ్ చెప్పాడు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ తాను వాడనని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు జొకోవిచ్. ఇక ఆడ్రియా టోర్నమెంట్ మొత్తం దగ్గరుండి జొకోవిచ్ చూసుకున్నాడు. సెర్బియా రాజధానిలో తొలి దశ టూర్ ముగియగా ఆ తర్వాత రెండో దశ పర్యటన జదార్‌లో జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ తాను ఈ మ్యాచ్‌లను నిర్వహించడాన్ని సమర్థించుకున్నారు జొకోవిచ్.

తనను క్షమించాల్సిందిగా కోరిన జొకోవిచ్
ఇదిలా ఉంటే కరోనావైరస్‌తో బాధపడుతున్న వారికి ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే డబ్బులను ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో మొదలుపెట్టామని జొకోవిచ్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పగానే ఎంతో మంది ముందుకు వచ్చి సహకారాన్ని అందించారని జొకోవిచ్ చెప్పాడు. వైరస్ బలహీన పడుతున్న సమయంలో ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించినట్లు గుర్తుచేసిన జొకోవిచ్... అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండటంతోనే టోర్నమెంట్ నిర్వహించేందుకు ముందుకు వెళ్లామని స్పష్టం చేశాడు.
అయితే ఈ వైరస్ ఇంకా వీడకపోవడం దురదృష్టకరమన్నాడు. అయితే ఈ వైరస్‌తో కలిసే జీవించాలన్నది నగ్న సత్యం అని జొకోవిచ్ చెప్పాడు. ఇదిలా ఉంటే హోంక్వారంటైన్‌లో 14 రోజుల పాటు ఉంటానని వివరించిన జొకోవిచ్... ఈ సిరీస్ ద్వారా ఇతరులు ఎవరైనా ఇన్‌ఫెక్షన్‌కు గురై ఉంటే క్షమించాల్సిందిగా కోరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications