Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షరపోవా 'షుగర్‌పోవా' క్యాండీ బిజినెస్ సూపర్ సక్సెస్ (వీడియో)

Sbe Announces Global Partnership With Sugarpova
sbe announces global partnership with tennis icon Maria Sharapovas Sugarpova confectionery line

హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్‌లో ఎంతో మంది అందగత్తెలున్నా వారిలో రష్యన్ టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా తర్వాతే. 2012లో షరపోవా ప్రారంభించిన క్యాండీ బిజినెస్ 'షుగర్‌పోవా' ఇప్పుడు దూసుకుపోతోంది. తాజాగా షరపోవా ఎస్‌బీఈ హోటల్ గ్రూప్‌తో ప్రపంచవ్యాప్తంగా ఒప్పందం కుదుర్చుకుంది.

గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ టెన్నిస్‌లో గాయాలు, ఏడాదిపాటు నిషేధం కారణంగా తన స్థాయికి తగ్గట్టుగా షరపోవా రాణించలేకపోతోంది. అయితే, షుగర్‌పోవాతో మొదలుపెట్టిన ఈ క్యాండీల బిజినెస్‌ మాత్రం దూసుకుపోతుంది. షుగర్‌పోవా క్యాండీలకు షరపోవా యజమానే కాదు బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహారిస్తోంది.

ఇందుకు సంబంధించి తాజాగా షరపోవా ఓ వీడియో షూట్ చేసింది. దీంతోపాటు 'షుగర్‌పోవా' క్యాండీ బిజినెస్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యధికంగా ఆర్జించే మహిళా టెన్నిస్ ప్లేయర్లలో షరపోవా కూడా ఒకరు. తానే స్వయంగా తన బిజినెస్‌ను ప్రమోట్ చేస్తుడటంతో షుగర్‌పోవా క్యాండీలు పాపులర్ బ్రాండ్‌గా మారాయి.

షుగర్‌పోవా బిజినెస్ సూపర్ సక్సెస్ అవ్వడానికి షరపోవా చేసే ప్రమోషనల్ యాడ్స్‌ కీలకంగా వ్యవహారించాయని ఎస్‌బీఈ హోటల్ గ్రూప్ పేర్కొంది. 31 ఏళ్ల మారియా షరపోవా వింబుల్డన్, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, అమెరికన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గింది. ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ టోర్నీలో షరపోవా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.

రష్యాకే చెందిన విటాలియా దియాచెన్‌కో 6-7(3), 7-6(3), 6-4తో 25వ సీడ్‌ షరపోవాను చిత్తుగా ఓడించింది. షరపోవా.. గ్రాస్‌కోర్టు ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఇలా ఆరంభంలోనే వెనుదిరగడం ఇదే తొలిసారి.

Story first published: Friday, July 27, 2018, 16:31 [IST]
Other articles published on Jul 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+