Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐటీటీఎఫ్‌ ర్యాంకింగ్స్‌.. సత్యన్‌ 24

Sathiyan Gnanasekaran reaches World No 24 rank in ITTF, to become first Indian to break into top-25

భారత టెన్నిస్ ప్లేయర్ జ్ఞానశేఖరన్‌ సత్యన్‌ సరికొత్త గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో సత్యన్‌ టాప్‌-25లో చోటు సంపాదించాడు. దీంతో టాప్‌-25లో చోటు సంపాదించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు.

ఐటీటీఎఫ్‌ సోమవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సత్యన్‌ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. హంగేరిలో గతవారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్యన్‌ మూడో రౌండ్‌కు చేరుకుని నాలుగు స్థానాలు ఎగబాకాడు. మరో ప్లేయర్ శరత్ కమల్ తొమ్మిది స్థానాలు కోల్పోయి 46వ ర్యాంకులో ఉన్నాడు. మణిక బాత్రా మూడు స్థానాలు కోల్పోయి 59వ ర్యాంకులో ఉంది.

'నా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నాను. 2019 చివరి వరకు టాప్‌-15లోకి చేరడమే నా లక్ష్యం. కోచ్ రామన్ కు కేవలం థాంక్యూ చెపితే సరిపోదు. అతని మద్దతు, మార్గ దర్శకత్వంకు ధన్యవాదాలు' అని సత్యన్‌ పేర్కొన్నారు.

Story first published: Tuesday, April 30, 2019, 9:22 [IST]
Other articles published on Apr 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+