80 వారాలు: సానియా Vs మంజ్రేకర్, ట్విట్టర్‌లో మాటల యుద్ధం
హైదరాబాద్: మన ఎదుగుదలను తట్టుకోలేని కొందరు మనల్ని కిందకు కించపరిచేలా వ్యవహరిస్తుండటం భారత్‌లో సర్వసాధారణం. అయితే అలా ఎందుకు చేస్తారా మాత్రం తెలియదు. తాజాగా ఇది టెన్నిస్ స్టార్ సానియా మిర్జా విషయంలో చోటు చేసుకుంది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మరో ఘనతను సాధించింది. వరుసగా 80 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన చరిత్ర సృష్టించింది. తద్వారా మహిళల డబుల్స్ విభాగంలో ఎక్కువ రోజులు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన భారత క్రీడాకారిణిగా సానియా మిర్జా నిలిచింది.
సానియా కంటే ముందు ముగ్గురు ఉమెన్ ప్లేయర్స్ మాత్రమే ఈ ఘనతను సాధించారు. వారిలో మార్టినా నవ్రతిలోవా (181 వారాలు) తొలిస్థానంలో ఉండగా.. కారా బ్లాక్ (145 వారాలు), లీజెల్ హ్యూబెర్ (134 వారాలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ ఘనత సాధించడం పట్ల సానియా మిర్జా సంతోషం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 'నంబర్ వన్ ప్లేయర్‌గా ఈ రోజుకు వరుసగా 80 వారాలు పూర్తి చేసుకున్నాను. ఇది అద్భుత ప్రయాణం. మరింతగా కష్టపడేందుకు నాకు ప్రేరణనిస్తోంద'ని సానియా ట్వీట్ చేసింది.
సానియా మిర్జా ట్వీట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యంగ్యంగా దీని అర్ధం డబుల్స్ విభాగంలో 'నెంబర్ వన్ డబుల్స్ ప్లేయర్, కంగ్రాట్స్' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై సానియా మిర్జా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'సింగిల్స్ ఆడడం లేదంటే డబుల్స్ అనుకోవడమే కదా కామన్‌సెన్స్.! కామన్ సెన్స్ అనేది అంత కామన్ కాదనుకుంటా' అంటూ సానియా కాస్తంత ఘాటుగానే ట్వీట్ చేశారు.
తనకు శుభాకాంక్షలు చెప్పినందుకు మాత్రం థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత ట్వీట్‌లో 'కామన్‌సెన్స్ లోపించిన నాలాంటి వాళ్ల కోసం నువ్వు పూర్తి వివరాలు ఇవ్వలేదు కాదా' అని బదులివ్వడంతో డబ్లూటీఏ వెబ్‌సైట్‌లో వివరాలతో కూడిన వార్తకు సంబంధించిన లింక్‌ను పోస్ట్ చేసింది. 'ఆ వార్తలోనూ నేను చెప్పినట్లు డబుల్స్ నెంబర్ వన్ అనే కదా ఉంది. అన్ని బంతుల్ని ఆఫ్‌సైడ్‌ది ఆఫ్ స్టంప్‌వైపు వదిలేద్దాం' అని ట్వీట్ చేశాడు. మంజ్రేకర్ మళ్లీ కాస్తంత ఎగతాళిగా ట్వీట్ చేశాడు.
కాగా, మార్టినా హింగిస్‌తో కలిసి ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచి సానియా నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. ప్రస్తుతం సానియా ఖాతాలో 8885 పాయింట్లు ఉన్నాయి. మార్టినా హింగిస్‌తో కలిసి కేవలం 12 నెలల్లో 13 టైటిల్స్ గెలిచి సాంటినా జోడీగా పేరుగాంచింది.
ఈ ఇద్దరూ వరుసగా 41 విజయాలు సాధించారు. అప్పటి నుంచి వీరిద్దరి జోడీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన సానియాకు ట్విట్టర్ ద్వారా మహేశ్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాల అభినందనలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications