For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానియా పాక్ తరఫునే ఆడాలి: అబ్బాస్

By Pratap
Sania Mirza
కరాచీ: షోయబ్ మాలిక్ తో పెళ్లి తర్వత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తమ దేశం తరఫుననే ఆడాలని పాకిస్తాన్ టెన్నిస్ సమాఖ్య చీఫ్ దిలావర్ అబ్బాస్ అన్నారు. సానియా సంప్రదాయాన్ని పాటించాలని ఆయన అన్నారు. పాకిస్తాన్ తరఫున ఆడే విషయంపై సానియా ఆలోచన చేయాలని ఆయన అన్నారు. సానియా మాలిక్ ను పెళ్లి చేసుకోవడం టెన్నిస్ సామాజిక శ్రేణికి గొప్ప వార్త అని, తాము ఆమె స్వాగతిస్తున్నామని, ఆమె పాకిస్తాన్ పౌరసత్వం తీసుకుని పాక్ తరఫున ఆడుతుందని ఆశిస్తున్నామని, పాక్ తరఫున ఆడితే తమకెంతో ఆనందంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఆసియా మహిళలు సాంప్రదాయికంగా భర్తలను అనుసరిస్తారని, అందువల్ల ఆమె షోయబ్ తో స్ఫూర్తి పొంది పాక్ తరఫున ఆడడానికి ఏదో ఒక రోజు ముందుకు వస్తుందని ఆశిస్తున్నామని ఆయన ది న్యూస్ కు చెప్పారు. భారత్ తరఫున ఆడాలని సానియా నిర్ణయం తీసుకున్నా కూడా పాకిస్తాన్ మహిళల్లో టెన్నిస్ ప్రోత్సాహానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. తమ దేశ బాలికలు టెన్నిస్ లో అంతర్జాతీయ క్రీడాకారిణులుగా ఎదిగేందుకు సాయపడుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

కాగా, తన కూతురు సానియా మీర్జా పెళ్లి తర్వాత కూడా భారత్ తరఫుననే ఆడుతుందని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పష్టం చేశారు. తాను భారత్ తరఫుననే ఆడుతానని, భారత్ పౌరురాలిగానే ఉంటానని సానియా ఇదివరకే చెప్పింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+