హోబర్ట్ టోర్నీ: సానియా తొలి రౌండ్ గెలుపు

హోబర్ట్ : హోబర్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ సంచలనం సానియా మీర్జా ముందంజ వేసింది. హోబర్ట్‌లో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సానియా స్పెయిన్‌కు చెందిన క్వాలిఫైర్ లూర్దెస్ డోమింగెజ్‌ను 6-4, 6-0 సెట్లతో ఓడించింది. తదుపరి రౌండ్‌లో రష్యాకు చెందిన అల్లా కుద్రియత్సేవాతో సానియా తలపడనుంది. కుద్రియత్సేవా 6-3, 6-2తో మోనిక్ ఆదంజాక్‌ను ఓడించి, రెండో రౌండ్లో ప్రవేశించింది.
మరోవైపు సిడ్నీలో జరిగే మెడిబ్యాంక్ ఇంటర్నేషనల్ టోర్నీలో లియాండర్ పేస్, హాన్లీ జంట ఓటమి పాలైంది. మార్టిన్ డాం- పావెల్ విజ్నెర్ జంట 6-7, 4-6 సెట్లతో వారిపై విజయం సాధించింది. ఇదే టోర్నీలో భూపతి- నౌల్స్ జంట చెక్ రిపబ్లిక్‌కు చెందిన రాడెక్ స్టెపానెక్- థామస్ బెర్డిచ్ జంటతో తలపడనుంది.
Story first published: Tuesday, January 8, 2008, 15:39 [IST]
Other articles published on Jan 8, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications